ఏపీ సీఎం చంద్రబాబు ఓడిపోయారు.. ఎన్నికల ముందు సర్వేలు.. ఎన్నికల తర్వాత సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా ఇదే విషయాన్ని చెప్పాయి. అనుకున్నట్టుగానే చంద్ర బాబు ఓడిపోయారు.అ ఓటమికి ప్రత్యక్షంగా ఎన్ని కారణాలు కనిపిస్తున్న
అసలు కారణం వేరే ఉందంటున్నారు పండితులు
🔅అసలు కారణం ఇది :
అదేంటంటే.. ఏపీ సెక్రటేరియల్ భవనాల వాస్తు అస్సలు బాగా లేదట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వాస్తు సిద్ధాంతి సెలవిచ్చారట. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి సాములు ఏమన్నారంటే..
అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట. ముఖ్యంగా సెక్రటేరియట్‌ను నిర్మించే విషయంలో తప్పుడు వాస్తు ప్రకారం కట్టడాలు కట్టారని సిద్ధాంతి స్పష్టం చేశారు. వాస్తుకు విరుద్ధంగా కట్టడాలు నిర్మించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సో.. వాస్తు కూడా చంద్రబాబు ఓడిపోతారనే చెప్పిందన్నమాట.