ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు ఎవరిది అనేది నిన్నటి వరకు అందరికీ ఎంతో ఆసక్తి కూడిన విషయం. గెలుపు మాదంటే మాదే అని తెలుగు దేశం , వైస్సార్సీపీ పార్టీలు ధీమా వ్యక్తం చేసాయి.
ఇక ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి మెజార్టీ సీట్లు వస్తాయంటూ జాతీయ మీడియా సంస్థలు చెప్పడం.. పార్టీ కేడర్‌లోనూ ఎగ్జిట్ పోల్స్ ఫుల్ జోష్ నింపాయి.కానీ కొంత మంది లో వైసీపీ విజయం పై ఎక్కడో అపనమ్మకం ఉన్న మాట నిజమే. అలాంటి సందర్భం లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫలితాల పై తన నమ్మకాన్ని ఒక పోస్ట్ రూపం లోబలంగా వ్యక్తం చేసారు .
👉జగన్ చెప్పిన జోస్యం : “రాజన్న రాజ్యం రాబోతోంది.. సుపరిపాలన అందించడమే ఇక నా సంకల్పం “అని చాలా నమ్మకంగా పోస్ట్ చేసారు.
👉ఇప్పుడు జగన్ గెలుపు తో తమ నాయకుడు చెప్పిందే నిజమయిందని కార్య కర్తలు , అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..మొత్తానికి జగన్ చెప్పిన జోస్యం ఫలించింది.