గుడివాడ నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుంది. అన్న రామారావు గారు, నటసామ్రాట్ అక్కినేని, కొండపల్లి సీతారామిరెడ్డి గారు, మరెందరో పుట్టిన ప్రాంతమిది.
కోడలి శ్రీ వెంకటేశ్వర రావు…….నాని అని నియోజకవర్గం ప్రజలు అభిమానం గా పిలుచుకునే ఈ నాయకుడు….సాక్షాత్తు చంద్రబాబు, లోకేష్ పైనే ధైర్యంగా ధ్వజమెత్తారు.
అన్న రామారావు గారి అభిమాని గా కొనసాగుతూనే, వైస్సార్ నేత జగన్ పట్ల అభిమానాన్ని సూటిగా చాటి చెప్పిన ఈ నాయకుడిని ఎదిరించడానికి టీడీపీ కృష్ణ జిల్లా యంత్రాంగం మొత్తం కనా కష్టాలు పడుతోంది అంటే అతిశయోక్తి కాదేమో.
అయినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం, దృడంగా, స్థిరంగా నిలబడ్డ నాయకుడు. దేవినేని కుటుంబాన్ని ఉసిగొల్పి నాని మీద పోటీ చేయించిన….నాకేంటి, ప్రజలు నావాళ్లు అనే ధైర్యం తో ప్రశాంతం గా ఎన్నికల పర్వాన్ని ఎదుర్కొన్నారు.
అయన అంచనాలు నిజం చేస్తూ…..గుడివాడ ప్రజలు నాని వెన్నంటే ఉన్నారు. గుడివాడ ప్రజలు నాని ముందంజలో, దేవినేని అవినాష్ ను దరిదాపుల్లో కూడా రాకుండా చూస్తున్నారు.
ప్రస్తుత లీడ్: వైసీపీ- 126 , టీడీపీ- 13 , NDA – 311 , UPA – 111