ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ సృష్టించిన ప్రభంజనం దెబ్బకి టీడీపీ తీవ్ర ఓటమికి గురయ్యింది. 👉175 సీట్లున్న ఏపీ అసెంబ్లీలో ఏకంగా 151 సీట్లలో విజయ దుందుభి మోగించిందివైసీపీ… అధికార టీడీపీని కోలుకోలేని దెబ్బ కొట్టేసిందనే చెప్పాలి. 175 సీట్లలో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 సీట్లకు పరిమితమయ్యే పరిస్థితి. సరే… అధికారం వైసీపీదే అని తేలిపోయిన తర్వాత టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చినా… విపక్షంలో కూర్చోక తప్పదు కదా.
గతంలో టీడీపీ విపక్షంలో ఉండగా… ఆ పార్టీ అధినేత – కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబునాయుడు విపక్ష నేతగా కొనసాగారు కదా.మరి ఇప్పుడు కూడా చంద్రబాబు ఆ పార్టీ అధినేతగానే ఉన్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానూ గెలిచారు. మరి ఇప్పుడు కూడా టీడీపీ విపక్షంలో ఉంటే… చంద్రబాబు విపక్ష నేతగావ్యవహరించాల్సిందే కదా.
🔴విపక్షం లో ఉండను :చంద్రబాబు:
ఎన్నికల్లో గెలవలేకపోయామన్న బాధ కంటే కూడా తనకంటే చిన్న వయసున్న జగన్ సీఎంగా ఉంటే… తాను విపక్ష నేతగా ఎలా ఉంటానంటూ చంద్రబాబు దీర్గాలు తీస్తున్నారట. తన రాజకీయ అనుభవమంత వయసున్న జగన్ సీఎంగా ఉంటే.. తాను విపక్ష నేతగా ఉండలేనని ఆయన తన పార్టీ నేతల వద్ద తేల్చేశారట.ఎంతైనా సీనియర్ సీనియరే కదా..ఆమాత్రం ఉంటుంది.