ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే ప్రభుత్వం వైసీపీదే అని అర్థం అవుతుంది.దాదాపు 80 % పైగా ఓట్లు వైసీపీ కి వేశారు తెలుగు ప్రజలు.దీనికి కారణాలు
🔅ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు: మోసం ఒకసారి చేయగలవు కానీ ప్రతిసారి చెయ్యలేవు అనే సత్యాన్ని మరోసారి నిరూపించారు ఆడవాళ్ళందరూ. జనాలను మోసం చెయ్యడం ఒక కళ. ఐదేళ్లు వాళ్ళకి ఇవ్వవలసినవి ఏమి ఇవ్వకుండా, ఎన్నికల వేళా ఇదిగో ముక్క ఇదిగో ముక్క అని విసిరేస్తే ముక్కల కోసం ఎగబడి మన కాళ్లదెగ్గర పడుంటారని అనుకుంటారు చంద్రబాబు అనేది వైసీపీ చేసిన ప్రధాన ఆరోపణ.
వారి ఆరోపణకు తగ్గట్లు నాయుడు గారు కూడా ధారాళంగా “తమ్ముళ్లు మీకు డబ్బులు ఇవ్వకుండా ఐటీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారు, అయినా నేను మీకు చెక్కులేసా…పసుపు-కుంకుమ చెక్కులేస్తే…..ప్రభుత్వం సొమ్మును తన కుటుంబ సొమ్ములా మాట్లాడిన విధానం సొంత టీడీపీ కార్యకర్తలకే రోతగా అనిపించిందంటే అతిశయోక్తి కాదేమో”.
🔅పసుపు-కుంకుమ:
పసుపు-కుంకుమ కూడా వర్క్ అవుట్ అవ్వలేదు. “చెక్కులు ఎన్నికలకు రోజుల ముందుగా బ్యాంకు ఖాతాల్లో వేసాము, ఆడవాళ్ళందరూ మాకే ఓటేస్తారు…..వెయ్యాలి కూడా అనే విధంగా ప్రవర్తించిన టీడీపీ నాయకులూ చంప చెళ్లుమనిపించారు ఆంధ్ర రాష్ట్ర అక్క- చెల్లెళ్ళు.మొత్తానికి ఈ ఎన్నికల ఫలితాలు అవకాశవాద రాజకీయాలకు చెంపదెబ్బే.