ఏపీలో టీడీపీ గెలిచినా బాబుకు రోజూ చుక్కలే..!!! ఏపీలో గెలిచేదెవరు.. ఈప్రశ్నకు సమాధానం జగన్ అని బాగా వినిపిస్తోంది. కానీ కొన్ని సర్వేల చంద్రబాబు పేరు కూడా చెబుతున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ గెలిచినా చంద్రబాబు సంతోషపడే పరిస్థితి కనిపించడంలేదు.
ఎందుకంటే.. రాష్ట్రంలో ఎవరు వచ్చినా కేంద్రంలో మళ్లీ మోడీ సర్కారు ఖాయమని తేలిపోయింది. ఏపీ విషయంలో అటూ ఇటూ చెప్పినా.. కేంద్రం విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఒన్ సైడ్ గానే ఇచ్చేశాయి. కాబట్టి మరోసారి మోడీ ప్రధానికావడం ఖాయం.
అదే నిజమైతే.. చంద్రబాబుకు మోడీ చుక్కలు చూపించడం గ్యారంటీ అంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మోడీపై విపరీతంగా విమర్శలు గుప్పించారు. తిట్టాల్సిన తిట్లన్నీ తిట్టేశారు.
అంతే కాకుండా ఏకంగా మోడీ ప్రధాని కాకపోవడమే తన లక్ష్యమంటూ దిల్లీలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నించారు.శతవిథాలా మోడీ ప్రధాని కాకుండా అడ్డుకోవాలని కృషి చేశారు. మరి ఇదంతా మోడీ గుర్తుంచుకుంటారని ఒక వేళ ఏపీలో చంద్రబాబు గెలిచినా కష్టాలు తప్పవన్నది ఓ వాదన. చూడాలి ఏం జరుగుతుందో..