నందిగామ అసెంబ్లి పోస్టల్ బ్యాలెట్ లో వైసిపి ఆధిక్యంలో ఉంది. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం అసెంబ్లీ స్ధానం (83) మెత్తం ఓటర్లు 19500 ఉండగా , స్త్రీ లు 86578, పురుషుల 84514 ఓట్లు ఉన్నాయి. ఇందులో పోలయిన ఓట్లు171092 గా నమోదయ్యాయి. పోలింగ్ శాతం 87.73 గా నమోదయింది. కఅష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ మొత్తం 1020 ఓట్లుగా నమోదయ్యాయి. నందిగామ నియోజకవర్గం ఓటింగ్ ఫలితాలలో మొదటి రౌండ్ లో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి మెండితొక జగన్మోహన్‌రావు ఆధిక్యతలో ఉన్నారు. మైలవరం తొలి రౌండ్ లో టిడిపి అభ్యర్థి దేవినేని ఉమ ఆధిక్యంలో ఉన్నారు. నందిగామ తొలి రౌండ్ లో టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్య ముందంజలో ఉన్నారు.దేవినేని అవినాష్ పై 1630 ఓట్ల ఆధిక్యంలో కొడాలి నాని ఉన్నారు. కృష్ణాజిల్లా నందిగామ నియోజవర్గం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వైసిపి 89 ఓట్ల ఆధిక్యంలో ఉంది.