ఈ ‘సూపర్‌ అనకొండ’ రైలు చూశారా

Spread the love

*ఈ ‘సూపర్‌ అనకొండ’ రైలు చూశారా?* *చరిత్ర సృష్టించిన భారత రైల్వే శాఖ* ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం..

దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్‌ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్‌పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్‌కు చెందిన మూడు గూడ్స్‌ రైళ్లను జతచేసి నడిపి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది.

Anakonda train

దీనిపై రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. లోడుతో ఉన్న మూడు రైళ్లను జతకలిపి బిలాస్‌పుర్‌-చక్రధర్‌పూర్‌ డివిజన్ల మధ్య విజయవంతంగా నడిపినట్లు వెల్లడించింది. 15 వేల టన్నులకు పైగా సరకుతో ఉన్న మూడు రైళ్లను అనకొండను పోలినట్టుగా నడిపించినట్లు తెలిపింది.

గూడ్స్‌ రైలు సర్వీసుల రవాణా సమయాన్ని తగ్గించేందుకే ఈ వినూత్న ప్రయోగం చేపట్టినట్లు పేర్కొంది.

ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ..

కరోనా సంక్షోభ సమయంలో ఆహార ధాన్యాలు, ఎరువులు, బొగ్గు, ఇతర నిత్యావసర సామగ్రిని తరలించడంపై రైల్వే శాఖ దృష్టి పెట్టిందన్నారు.

శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ల ద్వారా వలసకూలీలను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు.

రైల్వేశాఖ దేశంలో ప్యాసింజర్ రైళ్ల కదలికను పరిమితం చేసినప్పటికీ గూడ్స్‌ రైలు సేవలు యథాతథంగా నడుస్తున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *