డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర రహదారి, రవాణా శాఖ వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
గత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలపరిమితి ముగిసిపోయే డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల పర్మిట్లు, రిజస్ట్రేషన్ పత్రాల చెల్లుబాటు గడువును జూన్ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం సూచనలు జారీ చేసింది. లాక్‌డౌన్ కారణంగా ఈ పత్రాల నవీకరణలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఫిట్‌నెస్, అన్నిరకాల పర్మిట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్‌తో పాటు, మోటారు వాహనాల నిబంధనల కిందికి వచ్చే ఇతర అన్ని రకాల డాక్యుమెంట్లకూ దీన్ని వర్తింపజేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.