*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు

Spread the love

*మన దేశంలోనే లిథియం అయాన్ బ్యాటరీలు*

న్యూఢిల్లీ: లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవడం తగ్గి మని రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అంతర్జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు.

లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో రూపొందించడమే తమ ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఎలక్ట్రిక్ క్ట్రి వెహికల్స్‌కు లిథియం అయాన్ బ్యాటరీ కీలక కాంపోనెంట్‌‌గా ఉంటుంది. ‘ఈ–మొబిలిటీ టెక్నాలజీలో మేము చేయాల్సిన అతిముఖ్యమైనది ఏమిటంటే…

ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌లో వాడే మెటీరియ ల్‌‌ను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడకుండా ఉండాలి. ఈ మెటీరియల్స్ అన్నింటినీ.. ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలను ఇండియాలో తయారు చేయడమే మా ప్రధాన కర్తవ్యం’ అని ఈ–మొబిలిటీ కాంక్లే వ్‌కాంక్లేలో గడ్కారీ అన్నారు. లిథియం అయాన్ మైన్లను రెండు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చామని చెప్పారు.

త్వరలోనే రా మెటీరియల్‌‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా టెక్నాలజీని డెవలప్‌ చేస్తున్నామని చెప్పారు.

సోడియం అయాన్ టెక్నాలజీపై కూడా తాము రీసెర్చ్ చేస్తున్నట్టు వెల్లడించారు. లిథియం సెల్స్ ఈవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌‌ల రీఛార్బుల్ జ్‌ బ్యాటరీలకు బ్లాక్స్‌ను అభివృద్ధి చేస్తాయి. ఇండియాలో బ్యాటరీ మెటల్ దొరుకుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ సెల్స్ కోసం ఇండియా ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.

లిథియం అయాన్ సెల్స్‌ను తక్కువ కాస్ట్‌‌కు అందుబాటులోకి తేవడానికి వీటిపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని గతేడాదే ఆర్కథి మంత్రి నిర్మలా సీతారామన్ ఎత్తివేశారు.

గ్లోబల్‌‌గా లిథియం అయాన్ సెల్ మాన్యుఫాక్చరింగ్‌‌లో చైనా ముందంజలో ఉంది.

ఆ తర్వాత అమెరికా, థాయ్‌‌లాండ్, జర్మనీ, స్వీడన్, సౌత్‌ కొరియాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *