JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు

Spread the love

*JIO TV: జియో టీవీలో ఇంటర్‌ పాఠాలు.. రోజూ ఉదయం 6 నుంచి రాత్రి 8.30 వరకు ప్రసారం*

కరోనా కారణంగా విద్యాభ్యాసానికి దూరమైన విద్యార్థుల కోసం ఆంద్రప్రదేశ్ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం విద్యార్థుల కోసం జియో టీవీలో పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఇంటర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు జియో టీవీ ద్వారా ఈరోజు (డిసెంబర్‌ 8) ఉదయం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు విద్యార్థులు పాఠాలు వీక్షించవచ్చని చెప్పారు. ఈవిధంగా పరీక్షలు ముగిసే వరకు వీటిని ప్రసారం చేస్తారు. అలాగే.. ఇవే పాఠ్యాంశాలను ఇంటర్‌ విద్యామండలికి చెందిన bieap virtual class అనే యూట్యూబ్‌ ఛానల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో ఇంటర్‌ ఫస్టియర్‌ పాఠ్యాంశాలతో పాటు జేఈఈ, ఎంసెట్‌, నీట్‌ పాఠాలను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నాయి. ఇంటర్మీడియట్‌ ఆన్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను విద్యార్థులు https://bie.ap.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *