*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు

Spread the love

*3.3 ట్రిలియన్ గంటలు ఫోన్లకు అతుక్కుపోయారు..*

▫️ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్ నెట్ అనే పదం తెలియని వారు చాలా కొద్దీమంది ఉండవచ్చు. ప్రతి చిన్న దానికి ఏదైనా వెతకాలంటే అందరికి మొదటగా గుర్తుకు వచ్చేది ఇంటర్ నెట్‌. అందుకే రోజు రోజుకి నెట్ మీద ప్రజలు ఎక్కువ సమయం గడుపుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి.

ఈ ఏడాది ఆండ్రాయిడ్ వినియోగదారులు 3.3 ట్రిలియన్ గంటలు తమ మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయినట్లు ఒక అనలిటిక్స్ సంస్థ తెలిపింది.

గత ఏడాదితో పోలిస్తే ఇంటర్ నెట్ వినియోగం 25 శాతం పెరిగింది అని పేర్కొంది.

▫️ఒక అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ట్విటర్ లేదా ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌తో పోలిస్తే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ అయిన జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి యాప్స్ పై ఎక్కువ సమయం గడపడం విశేషం.

కరోనా మహమ్మారి కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా బిజినెస్ యాప్స్ మీద గత ఏడాది కంటే ఈ ఏడాది రెండు రెట్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించారు.

వ్యాక్సిన్లు త్వరలో రానున్నప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చే ఏడాది కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. అందుకే వచ్చే ఏడాది 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది.

2020లో వినియోగదారులు ఇంటర్ నెట్‌లో ఎక్కువ గంటలు గడపడానికి కొన్ని ఇతర అంశాలు కూడా ఉండవచ్చు.

ఈ ఏడాది ఆండ్రాయిడ్ డౌన్‌లోడ్‌లు 10 శాతం పెరిగి 90 బిలియన్ల మార్కును దాటాయి. వినియోగదారులు ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న వాటిలో గేమ్స్ కి సంబందించిన యాప్స్ 45 శాతం వాటాను ఆక్రమించుకున్నాయి. ఆశ్చర్యకరంగా ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్లలో భారతదేశం, బ్రెజిల్, ఇండోనేషియా ప్రజలు అధిక మొత్తంలో డౌన్లోడ్ చేసుకున్నారు.

▫️టిక్‌టాక్ ను ఎక్కువ సంఖ్యలో డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని దాని మీదే గడిపారు. అందుకే ఇది డౌన్‌లోడ్‌ పరంగా మొదటి స్థానంలో నిలిచింది. జూమ్, గూగుల్ మీట్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్ కూడా డౌన్‌లోడ్‌ల పరంగా టాప్ 10లో ఉన్నాయి. యూత్ ఎక్కువ ఇష్ట్టపడే టిండర్ యాప్ కరోనా కారణంగా ఒకరిని ఒకరు కలవడం సాధ్యం కాకున్నా ప్రజలు అన్నింటికంటే దీని మీద ఎక్కువ సమయం గడిపినట్లు తెలుస్తుంది.

దీనికి లాక్‌డౌన్‌ సమయంలో వర్చువల్ డేట్స్ కోసం గ్లోబల్ స్వైపింగ్,  వీడియో కాలింగ్ వంటి ఫీచర్స్ ని తీసుకురావడమే. మల్టిపుల్ ప్లేయర్స్ కలిసి ఆడే గేమ్స్ ‘అమాంగ్ అస్’, ‘లూడో కింగ్’ వంటివి జనాకర్షణ పొందాయి. 2021లో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఈ ఏడాది మొబైల్ కంపెనీల ఆదాయం 120 బిలియన్ డాలర్లు దాటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *