మనము ప్రకృతిని ఆరాధిస్తూ వుంటాము. దానికి నిదర్శనమే ఈ నాగుల చవితి. ఈ పండుగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖ,సౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు. పాలతో బాటు పండ్లుఫలాలు , నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు.
నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.
నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు.
పుట్ట దగ్గర శుభ్రం చేసి , నీళ్ళు జల్లి , ముగ్గులు వేసి , పసుపు కుంకుమలు జల్లి , పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి , నాగదేవతకు నమస్కరించుకుంటారు.
ఇతరుల సంగతి అలా ఉంచి , నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.
నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి , సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆంధ్రులే కాకుండా కన్నడీలు కూడా నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. నాగులు
చవితి
రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, వడపప్పు నైవేద్యంగా నేవేదించాలి.
పాము పుట్టలో
పాలు పోసేటప్పుడు
ఇలా చెప్పాలి..
“నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ” అని చెప్పాలి.
ప్రకృతిని పూజిచటం
మన భారతీయుల
సంస్కృతి.
మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము. అని అర్ధము.
నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం.
పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్య వుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత
బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారంను పెట్టటం అన్నమాట.
ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చెవులకు పెడతారు.
ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.
ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళ్లు ఉపవాసం వుంటారు.
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి “నీటిని” ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా ” రైతు ” కు పంటనష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి.
దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.