మనమంతా రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు కాల్చినట్లే.
కాలుష్యాన్ని తీవ్రంగా తీసుకుంటే దిల్లీ ఖాళీ చేయాలి.. హైదరాబాద్: ఇంట్లో మనం పెంచుకునే పచ్చని మొక్క లక్ష్మీదేవితో సమానం అని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు. పూరీ మ్యూజింగ్స్‌లో భాగంగా ఆయన ‘గాలి కాలుష్యం’ గురించి మాట్లాడారు. గాలి నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని, జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ప్రభుత్వం టపాసుల్ని పూర్తిగా నిషేధించాలని కోరారు. ‘గాలి కాలుష్యం.. చాలా తీవ్రమైన సమస్య. అయినా మనం పట్టించుకోం. కానీ కొన్నాళ్లకు ఆరోగ్యం నాశనం అయిపోతుంది. గాలి నాణ్యత…