*పుతిన్ ఖాతాలో భారీ విజయం* *రాజ్యాంగ సవరణలకు ఆమోదం* *మద్దతు పలికిన 77.9% ప్రజలు* *మాస్కో:*
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో ఘన విజయం సాధించారు.
ఆయన ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణలను ఆ దేశ ప్రజలు భారీ మెజారిటీతో ఆమోదించారు.
ఏడు రోజులుగా జరిగిన ఎన్నికల ఫలితాలను గురువారం రష్యా ఎన్నికల కమిటీ ప్రకటించింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు 77.9 శాతం ఓటర్లు ఆమోద ముద్ర వేశారు. 21.3 శాతం మాత్రమే వ్యతిరేకించారు. 63.6 శాతం ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. పుతిన్ ప్రభుత్వం పెట్టిన అన్ని సవరణలు ఆమోదం పొందాయి.
అందులో కీలకమైంది ఆర్టికల్ 81 సవరణ. దీని ప్రకారం 2036 వరకు ఎన్నికల్లో పుతిన్ పోటీ చేయొచ్చు.
*మోదీ అభినందనలు:* రాజ్యాంగ సవరణలు భారీ మెజారిటీతో ఆమోదం పొందినందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను..
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో అభినందించారు. ఈ సందర్భంగా భారత-రష్యా వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయాలని ఇరువురు నాయకులు నిర్ణయించినట్లు భారత ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.