*వచ్చే ఏడాది తొలి బడ్జెట్ 5జీ ఫోన్!* ▪︎మార్కెట్ లోకి ఏదైనా కొత్త మోడల్ ఫోన్ వస్తే చాలు దానిలో ఎన్ని కెమెరాలు ఉన్నాయి.. ర్యామ్ ఎంత.. డిస్ప్లే, బ్యాటరీ సామర్థ్యం వంటి వాటిపై ఎక్కువగా దృష్టి పెడతాం. అయితే తాజాగా ఈ జాబితాలో 5జీ వచ్చి చేరింది. ఇప్పుడు విడుదలయ్యే మొబైల్ లలో ఎక్కువగా 5జీ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చూస్తున్నారు. ▪︎దీనికి తగ్గట్లుగానే నెట్వర్క్ సంస్థలు కూడా 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతున్నాయి. 2020లో మొబైల్ కంపెనీలు కూడా 5జీ ఫీచర్‌తో ఫోన్లను తీసుకొస్తున్నాయి. కానీ ప్రస్తుతం 5జీ ఫోన్ల యొక్క ధరలు ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ ధరలో ఫోన్ కొనాలనుకునే వారి ఆశ నిరాశగానే మిగిలిపోతుంది.
▪︎5జీ ఫోన్ల యొక్క ధర ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం ప్రాసెసర్ యొక్క ధర ఎక్కువగా ఉండటమే. దీనిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ధరలలో ఫోన్లు తయారు చేసే కంపెనీల కోసం మీడియా టెక్ కంపెనీ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే మీడియాటెక్ బడ్జెట్ ఫోన్ల కోసం డైమెన్సిటీ 720 ప్రాసెసర్ తీసుకొచ్చింది.
▪︎తాజా ప్రకటనతో బడ్జెట్ ధరలో 5జీ ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు మొబైల్ కంపెనీలకు మార్గం సుగమమైంది. మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ డ్యూయల్ సిమ్ 5జీని సపోర్ట్ చేస్తుంది. దాని వల్ల ఒకే ఫోన్లో రెండు 5జీ నెటవర్క్లను మీరు ఉపయోగించవచ్చు. ▪︎కొత్త డైమెన్సిటీ 700 ప్రాసెసర్ 7 ఎన్ఎమ్ తయారుచేశామని, వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో దీనిని విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఇది రెండు కార్టెక్స్- A76 సిపియు కోర్లతో 2.2జీహెర్ట్జ్ మరియు ఆరు కార్టెక్స్- ఏ55 కోర్లతో క్లాక్ చేయబడిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్-ఇంటెన్సివ్ పనులకోసం మాలి- జీ57 ఎమ్ సీ యు జీ పీ యు ఉంది. మునుపటి తరం చిప్సెట్లతో పోలిస్తే మెరుగైన ఆడియో నాణ్యతను అందించే డ్యూయల్ స్టాండ్‌బై, వాయిస్ ఓవర్ న్యూ రేడియో(VoNR)ను కూడా మీరు పొందుతారు.
▪︎ఇది గ్లోబల్ 5జి ఎన్ఆర్ బ్యాండ్ సపోర్ట్, మీడియాటెక్ యొక్క “5జీ అల్ట్రాసేవ్” బ్యాటరీ సేవింగ్ టెక్నాలజీతో వస్తుంది. అలానే, ఈ ప్రాసెసర్‌తో 5జీ డౌన్‌లింక్ వేగం 2.77 జీబీపీఎస్ ఉంటుందట. ఇంకా ఏఐ-కలర్, ఏఐ-బ్యూటీ, మల్టీ ఫ్రేం నాయిస్ రిడక్షన్ ఫీచర్స్ 48 ఎంపీ, 64 ఎంపీ కెమెరాలతో పాటు 90హెడ్జ్ ప్రీమియం డిస్ప్లేను ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ధర 250 డాలర్లు ఉంటుందని మీడియాటెక్ తెలిపింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.18,000. అయితే ఈ ధర మరింత తగ్గొచ్చనేది మార్కెట్ వర్గాల నిపుణుల అభిప్రాయం.