పెళ్ళిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కారణం ఏమిటి.అసలు ఎవరీ అరుంధతి..?
కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తర్షి మండలంలో వున్న వశిష్టుని నక్షత్రానికి ప్రక్కనే వెలుగుతుండే మరోనక్షత్రాన్ని చూపిస్తారు పురోహితులు . అదే అరుంధతీ నక్షత్రం. . నూతన దంపతులకు ఈ అరుందతీ నక్షత్రాన్ని చూపించడం వెనుక ఓ ప్రదాన ఉద్దేశ్యం ఉంది అదేంటంటే… వశిష్ట, అరుంధతీ వీరిద్దరూ పురాణాలలోని ఆదర్శ దంపతులు. కొత్తగా పెళ్ళైన దంపతులు కూడా వారిలాగా ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు కొత్త జంటను ఆ నక్షత్రాల జంట వైపు చూడమని అంటారు.అరుంధతి ఎవరు…