మాంసాహారం తింటే కరోనావైరస్
మాంసాహారం తీసుకుంటే కరోనావైరస్ సోకుతుందంటూ సోషల్ మీడియాలో కొనసాగుతున్న ప్రచారం కారణంగా కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మాంసం ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గింది. ఈ ప్రభావం పౌల్ట్రీ పరిశ్రమపై తీవ్రంగా పడింది. ఎగుమతులతో పాటు అమ్మకాలపైనా తీవ్ర ప్రభావం పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాంసం అమ్మకాలపై అధికారులే ఆంక్షలు విధిస్తుండటం విశేషం. ప్రస్తుతం అమ్మకాల పరిస్థితి ఏంటి ? నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎగ్ & పౌల్ట్రీ-2022 పేరిట…