కొంత మంది తల్లి తండ్రులు , గురువులు ఈ పోస్ట్ ని తప్పక చదవండి…
ఈ మధ్యన చాలామంది విద్యార్థులు మార్కులు తక్కువగా వచ్చాయనో లేదా రాబోయే, రాయబోయే పరీక్షలో మార్కులు తక్కువగా వస్తాయనో లేదా తక్కువ మార్కులు వస్తే తమ తల్లిదండ్రులు ఏమంటారో అని భయపడో బలవంత మరణానికి పాల్పడుతున్నారు . దీనికంతటికీ కారణం పిల్లలను కేవలం చదువుకునే యంత్రాల్లా చూసే కొంత మంది తల్లిదండ్రులు మరియు గురువులు అని అర్థమవుతుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారందరికీ ఢిల్లీ కి చెందిన ఒక గృహిణి తెలుసుకోవాల్సిన పాఠం లా కనిపిస్తుంది ….