కంగారూలపై యువీ సింహగర్జన
1..2..3..4..5 కాదు 28 ఏళ్ల నాటి కల. అవును! టీమిండియా రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్నది శతకోటి భారతీయుల 28 ఏళ్ల నాటి కల. 2011లో సొంతగడ్డపై లీగ్‌దశను దాటి క్వార్టర్ ఫైనల్ చేరింది ధోనీసేన. ఫైనల్ చేరే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్ అది. ప్రత్యర్థేమో పసికూన కాదు. నాలుగు సార్లు విశ్వవిజేత. భీకరమైన ఆస్ట్రేలియా. 2003 ఫైనల్లో భారత భంగపాటు పదేపదే కలవరపాటు కలిగిస్తోంది. ఒత్తిడి కొర కొరా చంపేస్తోంది. ఆసీస్‌తో పోరు కంగారు పెడుతోంది….