4000 ప్రత్యేక బస్సులు… మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు

0

ప్రపంచ ప్రఖ్యాత మేడారం జాతరకు తెలంగాణ సిద్ధమవుతోంది. జాతరకు తరలి వచ్చే భక్తుల కోసం… తెలంగాణలోని 51 ప్రాంతాల నుంచి 4000 బస్సుల్ని వేస్తున్నట్లు… ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఫిబ్రవరి 2న మేడారం మహా జాతర మొదలవుతుంది. అందువల్ల ఫిబ్రవరి 2 నుంచీ 8 వరకు… వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ఆర్టీసీ రీజినల్‌ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సేవలు అందించబోతోంది. మొత్తం 23 లక్షల మందిని తరలించాలని ఆర్టీసీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం మేడారం విధుల్లో 12,500 మంది ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. మేడారం పరిసరాల్లో మొత్తం 59 ఎకరాల్లో బస్టాండ్, 39 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అందువల్ల ఈసారి మేడారం జాతర అదిరిపోతుందని అంటున్నారు. ఐతే… ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. ఏంటంటే… జాతర సమయంలో ఇప్పుడున్న ఛార్జీలకు 50% అదనంగా ఛార్జీలు వసూలు చేయబోతోంది ఆర్టీసీ. సపోజ్… రూ.200 టికెట్… మేడారం బస్సుల్లో రూ.300 ఉంటుంది. ఇది కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకోవడానికి బస్సుల్లో వెళ్లే భక్తులకు షాకింగ్ విషయమే అనుకోవచ్చు. ఏకంగా 50 శాతం ఛార్జీలు పెంచేయబోతున్నట్లు ప్రకటించడంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.

Leave a Reply