నిద్ర పోయేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా పడుకుంటారు..కానీ ఆ పడుకునే భంగిమ ను బట్టి వారు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
👉పక్కకు పడుకొని ఒకే కాలు ముడుచుకుంటే : కష్టపడి పనిచేసే రకం,చిన్న విషయాలకే పెద్దగా బాధపడతారు. అసంతృప్తి ఎక్కువ.
👉కుడిచేయి తలగడగా పడుకుంటే : ఆత్మవిశ్వాసమెక్కువ. ఎక్కువ పనుల్లో విజయం సాధిస్తారు. భిన్నమైన దారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారు. అదికారం, సంపద తోడుగా నిలుస్తాయి.
👉ఎడమ చేయిని తలకిందపెట్టుకొని పడుకుంటే : మంచితనం… పెద్దలంటే గౌరవం… చేసే పనిలో నిబద్దత, ఆత్మవిశ్వాసం తక్కువే.
👉చేతులు బారచాపి వెల్లకిలా పడుకుంటే : స్వేచ్చాప్రియులు.. నలుగురిలో ప్రత్యేక
మైన గుర్తింపు కోరుకుంటారు.
👉రెండు చేతులు తలగడగా బోర్లాపడుకుంటే : సంకుచిత స్వభావం. అవసరముంటేనే మాట కలిపే మనస్తత్వం.ఆలసత్వం, లక్ష్యం లేకపోవడం.
👉ఒకే పక్కకు తిరిగి రెండుకాళ్లు ముడుచుకుంటే : స్వార్థం, అసూయ, పగప్రతీకారాలకు ప్రతీక. ఎవరైనా వీళ్లకు భయపడి దూరంగా పారిపోతారు.