“రౌడీ” అనే దుస్తుల బ్రాండ్‌తో ఒకరు, ‘రౌడీ బేబీ’ అనే పాటతో మరొకరు తమ నటన, స్టైల్, చిలిపితనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న యువచలనాలు, దక్షిణాది ‘రౌడీలు’ విజయ్ దేవరకొండ, సాయిపల్లవి. వీరిద్దరూ తమ birthday ని ఇదే రోజు షేర్ చేసుకుంటున్నారు.
👉ఈ సందర్బంగా వారి గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు : 🔅విరహ ప్రేమికుడు ‘అర్జున్‌రెడ్డి’గా విజయ్ మెప్పిస్తే, ‘భానుమతి.. హైబ్రీడ్‌పిల్ల ఒక్కటే పీస్’ అంటూ కుర్రకారు మతి పోగొట్టి, నిద్రలేకుండా చేసింది సాయిపల్లవి.
🔅ఎక్కడ పుట్టారు!
విజయ్ అచ్చంపేట లో పుడితే, కోయింబత్తూరు లో పల్లవి జన్మించింది.
🔅చదువు :
విజయ్ చదివింది..”బీకామ్ పల్లవి చదివింది “మెడిసిన్..
మొదటి సినిమాలు :
2011లో విజయ్ ‘నువ్విలా’ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. పల్లవి 2005లో ‘కస్తూరి మాన్’ (తమిళం)చిత్రం తో సినీ కెరీర్‌ను ప్రారంభించారు.
సూపర్‌హిట్ మూవీస్ :
🔅‘అర్జున్‌రెడ్డి’తో కెరీర్‌లో బ్రేక్ లభించింది. ఈ సినిమాకు గానూ ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ దక్కింది. 🔅‘ప్రేమమ్’తో బ్రేక్ లభించింది. ఉత్తమ పరిచయ నటిగా ఫిలింఫేర్ అందుకున్నారు. తెలుగులో ‘ఫిదా’ సినిమా తో యువతను కట్టిపడేశారు.
ఇష్టమైన రంగు :
విజయ్ కి నీలం అయితే, సాయి పల్లవి కి గులాబీ, నీలం రంగులు ఇష్టం
ఇష్టమైన నటీనటులు :
🔅విజయ్ షారుక్ ఖాన్ అభిమాని అయితే ,
🔅సాయి పల్లవి సమంత, కమల్ హాసన్, సూర్య, మమ్ముట్టి, జ్యోతిక, సిమ్రన్ ల అభిమాని.
ఇష్టమైన ఆహారం :
విజయ్ కి దక్షిణాది వంటకాలు ఇష్టం అయితే ,సాయి పల్లవి కి చాకొలెట్స్, స్వీట్స్ అంటే ఇష్టం.
ఫేమస్ పాట:
విజయ్ ఇంకేం ఇంకేం కావాలే (గీత గోవిందం) , పల్లవి రౌడీ బేబీ (మారి 2)పాటలు
నటించిన చిత్రాలు :
విజయ్ 13 చిత్రాల్లో నటిస్తే పల్లవి 12చిత్రాల్లో నటించింది.
రాబోతున్న సినిమాలు :
🔅విజయ్ –
డియర్ కామ్రేడ్ 🔅పల్లవి – ఎన్జీకే, విరాటపర్వం
సోషల్‌మీడియా ఫాలోవర్స్ :
🔅విజయ్ కి
665k (ట్విటర్), 3.7m(ఇన్‌స్టాగ్రామ్), 1m(ఫేస్‌బుక్) లో అభిమానులు ఉన్నారు. 🔅పల్లవి కి1.29m (ట్విటర్), 1.4m (ఇన్‌స్టాగ్రామ్), 1.1m (ఫేస్‌బుక్)లో అభిమానులు ఉన్నారు. 💐ఇదండీ వారి పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు కు ఇచ్చే స్పెషల్ డీటెయిల్స్…