మనం పడుకునేటప్పుడు..ఒక పలానా దిక్కు వైపే తల పెట్టి పడుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. మరి ఏ దిక్కులో పడుకోవాలి ,ఏ దిక్కుగా పడుకోకూడదు అంటే. 𒐮👉 ఈ దిశ వైపు నిద్రించాలి : 🔅తూర్పు దిక్కు : ఇంద్ర స్థానం.అందుకనే నిద్రించేటప్పుడు తూర్పు కి తలబెట్టుకోవడం అన్ని విధాలమంచిది. ఇంద్రుడు దేవతల అధిపతి కాబట్టి అది దేవతల దిక్కు. కాబట్టి దేవతలుండేవైపు తలబెట్టి పడుకొంటే వారి అనుగ్రహం కలుగుతుంది.తూర్పువైపు తలబెట్టుకొని నిద్రిస్తే దేవతలను గౌరవించినవారమౌతాము. 👉🔅దక్షిణ దిక్కు : ఇది యమ స్థానం.దక్షిణ దిక్కు యమునికి చెందిన దిక్కు కాబట్టి అటు వైపు కాళ్ళు కాకుండా తలబెట్టుకొని పడుకోవడం ఆరోగ్యానికి,ఆయువుకు చాలా మంచిది. 👉🔴ఈ దిశవైపు నిద్రించకూడదు : 🔅ఉత్తర దిక్కు : అధిపతి కుబేరుడు.కానీ మనుషులు ఆ దిక్కుగా తల పెట్టుకోరాదు. శవము తలను ఉత్తరంవైపుకు పెడతారు. . గ్రహనక్షత్రాలన్నీ పడమటినుండి తూర్పుకు పయనిస్తున్నాయి. కావున తూర్పు దక్షిణం శిరస్సుంచి పడుకోవడం మంచిది మరి 👉సైన్స్ ప్రకారం : మ న భూమిలో అయస్కాంతశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనం అటువైపు తలపెట్టి నిద్రపోయామంటే ఆ దిక్కుల్లో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు, మన మెదడులోని శక్తిమంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించేస్తాయి. దానివల్ల అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు రావడమే కాక,రక్తప్రసరణలో మార్పు వస్తుందని చెప్తున్నారు. కాబట్టి సైన్స్, పురాణాలు కలిసి చెప్పేది ఏంటంటే తూర్పు దక్షిణం దిక్కుల వైపే నిద్రించండి అని,ఈ ఉత్తరం పడమరల వైపు నిద్రించకండి అని..ఫైనల్ గా చెప్పేది మన మంచికోసమే కాబట్టి follow అయిపోతే ఓ పని అయిపోతుంది.