స్వ సేవ మాత్రమే కాదు సమాజ సేవ కూడా ఒకేసారి చేస్తున్నారు ఫిలిప్పీన్స్ ప్రజలు. .పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్లాస్టిక్‌ను నియంత్రించాలి అని నినాదాలివ్వడం వరకే ఆగిపోలేదు ఫిలిప్పీన్స్ ప్రజలు. పర్యావరణం కోసం ఓ అడుగు ముందుకు వేసి వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు.
అందమైన బుట్టలు, చాపలు, ఇంట్లోకి ఫర్నీచర్ చేయడం వరకు మాత్రమే మనం వెదురును వాడుతాం. కానీ ఫిలిప్పీన్స్ దేశంలో వెదురుతో వాహనాలు తయారు చేస్తున్నారు. ఆ వాహనాలను బయో డీజిల్‌తో నడిపిస్తున్నారు. టబాన్‌టన్ అనే నగరంలో ఎక్కడ చూసినా వెదురు వాహనాలే దర్శనమిస్తాయి.
👉వెదురు వాహనాలు ఇలా తయారు చేస్తారు: వెదురు వాహనాలంటే ఏదో కొన్ని భాగాలు వెదురుతో చేస్తారనుకుంటే పొరపాటే. వాహనంలోని అన్ని భాగాలూ వెదురుతో మాత్రమే చేస్తారు. చక్రాలకు మాత్రం టైర్లు వాడుతారు.
♦ఈవాహనాల ప్రత్యేకత :ఈ వాహనాలకు బయోడీజిల్ ఉపయోగిస్తున్నారు. దీంతో పొగలేని రవాణా వ్యవస్థకు నాంది పలికారు. ఈ వాహనాలకు ఒక్క గ్యాలన్ బయోడీజిల్ పోస్తే ఎనిమిది గంటలు ప్రయాణించవచ్చు. తక్కువ ఖర్చుతో పర్యావరణహిత ప్రయాణానికి అక్కడి ప్రజలంతా జై కొడుతున్నారు. నాణ్యతలో, అందంలో ఏ మాత్రం లోటు లేకుండా ఉన్నాయి. సీట్లు కూడా సౌకర్యవంతంగా, ప్రయాణం బోరు కొట్టకుండా మంచి సంగీతంతో ఈ వెదురు బండ్లు దూసుకెళ్తున్నాయి. ఇప్పటి కార్లలో ఉండే ఆధునిక సౌకర్యాలన్నీ ఈ వెదురు వాహనాల్లో అమర్చుతున్నారు. ప్రకృతిని కాపాడుకుంటూనే.. సౌఖ్యాన్ని కోరుకుంటున్న ఫిలిప్పీన్స్ ప్రజలను మనం కూడా ఫాలో అవ్వాల్సిందే.ఇదే మన భవిష్యత్తు..