ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా విజయం తో పార్టిల మీద పార్టీ లు చేసుకోవడేమే కాదు….సినిమా ని కూడా తెగ ప్రమోట్ చేస్తున్నాడు. మహర్షి సినిమా తో భారి హిట్ టాక్ ని తన సొంతం చేసుకున్నాడు.
25 వ సినిమా హిట్ అవ్వడం తో మహేష్ బాబు గాల్లో తేలుతున్నాడు. మహేష్ అభిమానులు కూడా మహర్షి సినిమా విజయం తో హ్యాపీ గా ఉన్నారు. ఇక మహేష్ బాబు ఎంత. అందగాడు అనేది ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం.
వయసు పెరిగేకొద్ది అందం తరుగుతుంది అంటారు కానీ. మహేష్ అందం మాత్రం చెక్కు చెదరడం లేదు. అలాంటి అందగాడు ఇప్పుడు మహర్షి తో పాటు మరో గుడ్ న్యూస్ తో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.
సౌత్ నుంచి మొదటిసారి గా…
ఎప్పుడు బాలీవుడ్ హీరోస్ కి మాత్రమే సొంతంమయ్యే మోస్ట్ డిసైర్ బుల్ మెన్ లిస్ట్ లో ఈ సారి మహేష్ బాబు కూడా చోటు సంపాదించాడు. మొట్టమొదటి సారిగా సౌత్ నుండి మహేష్ బాబు ని మోస్ట్ డిసైర్ బుల్ మెన్ లిస్ట్ లో చేర్చారు. ఈ వార్త మహేష్ బాబు అభిమానులే కాదు. సౌత్ అభిమానులు గర్వం గా ఫీల్ అవ్వాలిసిన విషయం.