ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి

Spread the love

ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి

 

 

ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ తిరుగులేనిరీతిలో సత్తా చాటింది. ఏపీలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తిరుగులేని జనాదరణను చాటుతూ.. ఆయన నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి 132 నుంచి 135 సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. ఇక అధికార టీడీపీకి 37 నుంచి 40 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన సున్నా నుంచి ఒక స్థానం సాధిస్తుందని పేర్కొంది.

రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌ : కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌కు మరోసారి అవకాశం దక్కనుందని రిపబ్లిక్‌ టీవీ – సీ ఓటర్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే అంచనా వేసింది. ఈ సర్వే అంచనాల ప్రకారం ఎన్డీయేకు 287, యూపీఏకు 128, ఇతరులకు 127 సీట్లు వస్తాయని పేర్కొంది.

న్యూస్‌ నేషన్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. ఈ సర్వేలో ఎన్డీయేకు 282 నుంచి 290 సీట్లు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏకు 118 నుంచి 120 సీట్లు, ఇతర ప్రాంతీయ, జాతీయ పార్టీలకు 130 నుంచి 138 సీట్లు వస్తాయని పేర్కొంది.

ఇండియా టుడే– యాక్సిస్‌ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్‌ సర్వేలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని మెజారిటీ సాధించింది. ఈ సర్వేలో వైఎస్సార్‌సీపీకి 18 నుంచి 20 లోక్‌సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి నాలుగు నుంచి ఆరు స్థానాలు మాత్రమే వస్తాయని, ఇతరులకు సీట్లేమీ రావని అంచనా వేసింది.

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయమని సీపీఎస్‌ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ 133-135 స్థానాలను గెలుపొందనుందని, అధికార టీడీపీ కేవలం 37 నుంచి 40 సీట్లు మాత్రమే విజయం సాధిస్తుందని సీపీఎస్‌ సర్వే వెల్లడించింది. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని పేర్కొంది. వైఎస్సార్‌సీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్‌ వెల్లడించింది.

టైమ్స్‌నౌ – వీఎమ్మార్‌ ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో ఎన్డీయే కూటమి ఆధిక్యాన్ని సాధించింది. మ్యాజిక్‌ ఫిగర్‌ 272 కాగా, ఎన్డీయేకు 306 సీట్లు, యూపీఏకు 132 సీట్లు, ఇతరులకు 104 సీట్లు వస్తాయని పేర్కొంది.

న్యూస్‌-18 చానెల్‌ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో వైఎస్సార్సీపీకి 13 నుంచి 14 సీట్లు రాగా, టీడీపీకి 10 నుంచి 12 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు సున్నా నుంచి ఒక సీటు గెలుస్తారని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *