Sorry మరియు thanks పదాలు వాడకూడదట. ఈ పదాలకు బదులుగా కొత్త వాడుక పదాలు తీసుకొచ్చాడు tanuku కి చెందిన ఈ వ్యక్తి..
మాయాబజార్ సినిమాలో చెప్పినట్లుగా ఎవరూ సృష్టించే పోతే కొత్త పదాలు ఎలా వస్తాయి అనే డైలాగ్ ఒకటుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకో బోయే పదాలు కొత్త పదాలు కాకపోవచ్చు కానీ మనం కొన్ని సందర్భాల్లో వాడే రెండు పదాలు కి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి, కొన్ని బంధాలకు కొత్త జీవితాన్ని ఇస్తాయి .
🎉స్నేహబంధం : అన్ని బంధాల్లో కల్లా గొప్ప బంధం స్నేహబంధం అలాంటి స్నేహబంధం లో ఉండే నిజమైన స్నేహితుల మధ్య ఎటువంటి రహస్యాలు ఎటువంటి అరమరికలు ఉండవు. వారి మధ్య వచ్చే కోపం అయినా అలకలు అయినా తాత్కాలికమే. ఈ మాత్రం దానికి వారి మధ్య క్షమించమనే అంత తప్పులూ ఉండవ్, కృతజ్ఞతలు చెప్పేంత అవసరమూ ఉండదు.
🎉స్నేహితులు sorry చెప్పుకోకూడదు : ఒక స్నేహితుని మనం ఇష్టపడుతున్నామంటే అతని మంచిని ,చెడుని తప్పుల్ని ఒప్పుల్ని ఇలా అన్నిటినీ కూడా ఇష్టపడుతున్నట్లే. సాధారణంగా ఇద్దరు స్నేహితుల్లో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే తప్పుచేసిన వారు తన జరిగిన తప్పుని మరొకసారి రాకుండా చూసుకోవాలి, అవతలివారు తన స్నేహితుడు చేసిన తప్పుని సరిదిద్దుకోవడంలో తనకి సహకరించాలి. అంతేగాని క్షమాపణలు కోరకూడదు. అలా కోరితే ఆ స్నేహ బంధానికి బలం లేనట్టే.
🎉వీరు థాంక్స్ ( కృతజ్ఞతలు) చెప్పుకోకూడదు : ఎందుకు చెప్పకూడదు అంటే మన తల్లిదండ్రులు గానీ మన నిజమైన స్నేహితులు గానీ ఎప్పుడూ మన మంచిని కోరుకుంటారు ,అంతేకాదు మనల్ని క్షేమంగా చూసుకోవడం…మనకు సహాయం చేయడం వాళ్ళ బాధ్యత . కాబట్టి ఈ బంధాల మధ్య కృతజ్ఞతలు అనేవి ఉండకూడదు, చెప్పుకోకూడదు..మిగిలిన ఎవరికైనా ఈసారీ థాంక్స్ లు చెప్పచ్చు గాని తల్లిదండ్రులూ, స్నేహితులు ఇంకా భార్యాభర్తల మధ్య మాత్రం ఈ thanks& sorry అనే పదాలు ఉండకూడదు,వాడకూడదు. . ♦మరి ఈ బంధాల మధ్య క్షమించమనే సందర్భంగానీ , కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భంగాని వస్తే ఏ పదాలు వాడాలి అని ఆలోచిస్తున్నారా.. అలాంటి సందర్భాల్లో వాడటానికి రెండు పదాలను ఉపయోగించాలంటున్నాడు తణుకు పట్టణానికి చెందిన “శ్రీనాధ్. తాటిపాముల ” అనే ఒక వ్యక్తి.. ఆవేమిటంటే..
👉క్షమాపణలు (sorry) చెప్పడానికి బదులుగా : ఇద్దరు స్నేహితుల లో ఎవరైనా ఒకరు తప్పు చేస్తే సాధారణంగా మరొకరికి కోపం వస్తుంది. అలాంటి సందర్భాల్లో వారి కోపాన్ని తగ్గించడానికి.. క్షమాపణలు చెప్పకుండా 🎉Like. me. again (లైక్ మీ ఎగైన్ ) అనాలట. లేదా సింపుల్ గా Like me (లైక్ మీ..) ఇంకా బ్రీఫ్ గా Li. m. a (లైమా) అని కూడా అనవచ్చు.
👉కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భం లో ఈ పదం : ఆల్రెడీ చెప్పినట్లుగా తల్లీ పిల్లల మధ్య, నిజమైన స్నేహితుల ఇంకా భార్యాభర్తల మధ్య కృతజ్ఞతలు అనే పదానికి ఆస్కారం లేదు. ♦కానీ కృతజ్ఞతలు చెప్పాల్సిన సందర్భంలో “సహాయం చేసిన మీరు గొప్పవారు” అనే అర్థంలో 👉This is you అని గానీ లేదంటే షార్ట్ కట్ లో t.i.u (థి. యూ) అని గాని అనవచ్చు. లేదంటే 👉You are the great అని షార్ట్‌కట్‌లో U. r.g అన్నా సరిపోతుందని అంటున్నాడు ఆ వ్యక్తీ.. ♦so తెలుసుకున్నారుగా ఈ కొత్త పదాలు ,అప్డేట్ అయిపోతున్న ఈ యుగంలో కొన్ని బలమైన బంధాల మధ్య ఉండే గాఢతని అర్థంచేసుకోవడంలో ఈ కొత్త పదాలు లేదా ఈపాత పాదాలను కొత్తగా వాడటం అనేది చాలా అవసరం.
So ఫ్రెండ్స్ ఇక ఈ పదాల్ని అర్థం చేసుకోండి , యూస్ చేసేయ్యండి.. కొత్తగా సరికొత్తగా..*