Teluguwonders:
సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. వాటినే కొలమానాలు అంటారు. సినిమా హిట్, ఫట్ కూడా డిసైడ్ చేసే ప్రధాన అంశాల్లో గ్లామర్ చాలా ఇంపార్టంట్. అందుకే అందాల కోసం సినీ కెమెరాలు పరుగులు పెడతాయి. కెమెరా కన్నుతో చూసే సగటు ఆడియన్ అందులో పూర్తిగా లీనమైపోతాడు. అంటే అది కెమెరా కన్ను కాదు అది సాధారణ ప్రేక్షకుడి మనో నేత్రమన్న మాట.
ఇదిలా ఉండగా మరో నాలుగు రోజులో విడుదల కాబోతున్న సాహో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రభాస్ చాలెంజ్ గా తీసుకుని చేశారు. బాహుబలి తరువాత వస్తున్న ఈ మూవీ ద్వారా తన ఇంటర్నేషనల్ స్టార్ డం నిరూపించుకోవాల్సివుంది. లేకపోతే బాహుబలి హిట్ పూర్తిగా రాజమౌళి ఖాతాలోకే వెళ్ళిపోతుంది.
అందుకే ప్రభాస్ రాత్రి పగలు అని చూడకుండా రెండేళ్ల పాటు కష్టపడి మరీ సాహో చేశాడు. 350 కోట్లతో పెద్ద ఎత్తున నిర్మించిన సాహో ఇపుడు అన్ని వుడ్లను షేక్ చేస్తోంది. కాగా ఈ మూవీలో కొన్ని విషయాలు ఇపుడు బయటపడుతున్నాయి. కంప్లీట్ యాక్షన్ మూవీగా దీన్ని తీర్చిదిద్దారని అంతా అనుకుంటున్నారు
అయితే అది తప్పు అంటున్నారు సాహో యూనిట్. ఈ మూవీలో పిచ్చెక్కించే రొమాన్స్ కూడా ఉందని అంటున్నారు. వెండితెరపై శ్రధ్ధా కపూర్ ప్రభాస్ ల మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అన్నట్లుగా సాగిందట. అప్పట్లో ప్రభాస్ అనుష్క కెమిస్టీని ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అయ్యేవారు. ఇపుడు దాన్ని మించినట్లుగా ఈ ఇద్దరూ తమ రొమాన్స్ తో వెర్రెకించేస్తారట.
ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కోసమే ఇలా రోమాన్స్ లోడ్ చేసి మరీ సెల్యూలాయిడ్ మీద గ్లామర్ ఆరబోశారని అంటున్నారు. మరింకేం కమర్షియల్ సినిమాకు కావాల్సిన రొమాన్స్ కూడా దట్టించాక సాహో అనాల్సిందే.