పునర్నవి నాకోసం కోసుకొని రక్తం ఇస్తావా : రాహుల్

rahul and punarnavi
Spread the love

Teluguwonders:

బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా, ఈ వారం నామినేషన్‌లో మహేష్‌, రాహుల్‌, వరుణ్ సందేశ్‌, రవి కృష్ణ, హిమజ, పునర్నవి ఉన్నారు. ఆరోవారం తొలి రోజు పునర్నవి, రాహుల్ మధ్య గార్డెన్ ఏరియాలో ఆసక్తికర చర్చ జరిగింది. ఏదో విషయంలో ఇద్దరి మధ్య తేడా రాగా, పునర్నవి నువ్వు ఒక ఫ్రెండ్ మాత్రమే. నీలాంటోళ్ళు బయట బోలెడంత మంది ఉన్నారు. వారు నా కోసం కోసుకొని రక్తం ఇస్తారు.

నువ్వు ఇవ్వవు కదా అని పునర్నవిని కాస్త తగ్గించి మాట్లాడాడు రాహుల్‌. దీంతో పునర్నవి తనకి నిద్ర వస్తుందని బెడ్ రూంలోకి వెళ్లి పడుకుంది. తెల్లారి వరుణ్ సందేశ్ .. పునర్నవి, రాహుల్‌ని కలిపే ప్రయత్నం చేయగా అది బెడిసికొట్టింది.

రాహుల్‌పై చిర్రుబుర్రుమంది. ఇక తొలిసారి బిగ్ బాస్ వీక్లీ మ్యాగజైన్ ఇంటి సభ్యుల కోసం పంపించారు. ఇందులో గ్రూపులు కట్టడం,పునర్నవి లవ్ ట్రాక్, బాబా భాస్కర్ వంట.. అలీ డ్యాన్స్, రవి కృష్ణ పర్‌ఫార్మెన్స్ పై ఫన్నీ వార్తల్ని ప్రచురించారు.

ఇది చూసి ఇంటి సభ్యులు తెగ మురిసారు. ఇక 37వ ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియ గురించి బిగ్ బాస్ ఇంటి సభ్యులకి ఓ సూచన చేశారు. శివజ్యోతిని తప్పించి క్లోజ్‌గా ఉన్న వారు ఇద్దరు ఇద్దరిగా జతకట్టాలని అన్నారు . దీంతో రవి-అలీ, శ్రీముఖి-హిమజ, వరుణ్-పునర్నవి, రాహుల్-వితికా, బాబా భాస్కర్‌- మహేష్‌లు జోడీ కట్టారు.

జంటల్లో ఒకరిని సేవ్ చేసి మిగతా వారిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించారు. నామినేట్ అయిన వారిపై బకెట్‌లోని బురద చల్లాలని కూడా తెలిపారు. దీంతో ముందుగా వరుణ్- పునర్నవి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనగా పునర్నవి ఈ వారం ఎలిమినేషన్‌కి ఎంపికైంది. ఆ తర్వాత రవి, హిమజ, రాహుల్‌, మహేష్ ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *