Teluguwonders:
Ramya Krishna Bigg Boss:
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 42 ఎపిసోడ్లను పూర్తి చేసి ఆదివారం నాటితో 43 ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఎపిసోడ్ హైలైట్స్ అంటే ముఖ్యంగా రమ్యకృష్ణ అనే చెప్పుకోవాలి.
💚ఎనర్జీ నింపిన రమ్యకృష్ణ :
హోస్ట్‌గా తొలిరోజు కాస్త ఇబ్బంది పడినా .. బిగ్ బాస్ హౌస్‌కి రమ్యకృష్ణ రాకతో వెలుగువచ్చింది. రెండో రోజు ఫుల్ జోష్‌తో హౌస్‌లో ఎనర్జీ నింపింది.
💚‘వస్తానే వస్తానే’ అంటూ :
బ్లాక్ శారీలో వన్నెతరగని అందాలకు మెరుగుదిద్ది ఎంట్రీ సాంగ్‌తో వహ్ వా అనిపించారు. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంలోని ‘వస్తానే వస్తానే’ సాంగ్‌తో సూపర్బ్ ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ ‘సీన్ చేయండి’ అంటూ కంటెస్టెంట్ కొత్త ఆట ఆడించింది.ఈ ఎపిసోడ్ సరదా సరదాగా ఇంకాస్త సేపు ఉంటే బాగుండు అన్నట్టుగా సాగింది. హోస్ట్‌గా రమ్యకృష్ణ బిగ్ బాస్ గేమ్.. ఆడుతూ ఆడిస్తూ ప్రేక్షకుల్ని అలరించింది.ఇన్నాళ్లు బిగ్ బాస్ హౌస్‌లో ఏదైతే మిస్ అవుతూ వస్తుందో.. రమ్యకృష్ణ రాకతో కంటెస్టెంట్స్ కూడా ఫుల్ వినోదాన్ని పంచారు. నేటి ‘సీన్ చేయండి’ టాస్క్ చినిగిపోయిందంతే. సీజన్ 3 ప్రారంభం నుండి ‘సన్ డే ఫన్ డే’ అంటూ నాగార్జున చెబుతున్న ఆ ఫన్ నేటి ఎపిసోడ్లో కనిపించింది.
👉చెలరేగిపోయిన కంటెస్టెంట్స్:
ఒక సీన్ చెప్పి ఆ సీన్‌కి తగ్గట్టుగా పెర్ఫామ్ చేయాలని వాటికి మార్క్స్ కూడా ఉంటాయని అనడంతో చెలరేగిపోయారు కంటెస్టెంట్స్. మొదట.. అలీ, రవీలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులోని పూలకుండీ తన్నే సీన్ ఇవ్వగా ఫుల్ నవ్వించారు.
☺అనంతరం మహేష్ విట్టా, శివజ్యోతి, హిమజలకు ‘రంగస్థలం’ సినిమాలోని అనసూయ, రామ్ చరణ్, సమంత కాంబినేషన్లోని చెరువుకి నీళ్లు పెట్టే సీన్ ఇవ్వగా ఇరగదీశారు. సమంతగా హిమజ, రంగమ్మత్తగా శివజ్యోతి, రామ్ చరణ్‌గా మహేష్ విట్టాలు ఫుల్ ఎంటర్టైన్ చేశారు.
☺చంద్రముఖిలా శ్రీముఖి :
మూడో జోడీగా బాబా భాస్కర్, శ్రీముఖిలు హౌస్‌లో చంద్రముఖి సినిమా చూపించేశారు. చంద్రముఖిలా శ్రీముఖి శివతాండవం చేస్తే.. రజినీకాంత్‌లా బాబా భాస్కర్ ఇరగదీశారు. ‘చంద్రముఖి’ సీరియస్ సీన్‌కి కామెడీని మిక్స్ చేసి ఫుల్ ఫన్ నింపారు.
చంద్రముఖిలా మారిన శ్రీముఖి వీరవిహారం చేస్తుంటే.. నువ్ కాస్త ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు ఉన్నావ్ అంటూ కామెడీ యాడ్ చేశారు బాబా భాస్కర్. శ్రీముఖి అయితే చంద్రముఖి నిజంగానే పూనినట్టుగా నాట్యంతో వీరవిహారం చేసింది. బాబా భాస్కర్ తన కొరియోగ్రఫీ టాలెంట్‌ను మిక్స్ చేసి అద్భుతహ అనిపించారు. మొత్తానికి తమ యాక్టింగ్ టాలెంట్‌తో ఇద్దరూ ఇరగదీశారు. వీరి నటనకు రమ్యకృష్ణతో పాటు ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు.
💚💥స్టేజ్‌పై కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చిన శివగామి.. :
కంటెస్టెంట్స్‌తో డైరెక్ట్‌గా ముచ్చటించేందుకు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిందిశివగామి . హౌస్ అంతా కలియతిరుగుతూ మధ్య మధ్యలో పంచ్‌లు పేలుస్తూ.. నామినేషన్ ఉన్న హిమజ, పునర్నవి, మహేష్‌లను టెన్షన్ పెట్టారు. మధ్యలో రాహుల్‌ని ఉద్దేశించి.. నువ్ భూమ్మీద ఉన్నావా? లేక భూపాలంలో ఉన్నావా? అంటూ వదిలిన పంచ్ పేలిపోయింది.
💥 తూచ్.. ఎలిమినేషన్ లేదు..:
కీలకమైన ఎలిమినేషన్లో ఉన్న ముగ్గురికి శివగామి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈవారం ఎలిమినేషన్ లేదంటూ సర్ ప్రైజ్ ఇచ్చింది. మరోవైపు ‘వినాయక చవితి’ సందర్భంగా హౌస్ మేట్స్‌తో కలిసి గణపతి పప్పా అంటూ అదిరిపోయే స్టెప్పులను వేశారు రమ్యక్రిష్ణ. చివర్లో శివగామిగా ‘మహేంద్ర బాహుబలి’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌తో ఎపిసోడ్‌ను ముగించి వచ్చేవారం.. నాగార్జున హోస్ట్‌గా రాబోతున్నారని తెలిపి అందరికీ గుడ్ నైట్ చెప్పేశారు రమ్యకృష్ణ.