Teluguwonders:
తప్పులు మనుషులు మాత్రమే చేస్తారనుకుంటే పొరపాటు.. టెక్నాలజీ కూడా చేస్తుంది. విడ్డూరంగా ఉందనుకుంటున్నారా.. నిజమండీ. గూగుల్ ట్రాన్స్‌లేట్ – ఎన్నో భాషల్లో పదాలను తర్జుమారు చేస్తుంటుంది. అయితే పూర్తిగా దీనిపై ఆధారపడటం కూడా కరెక్ట్ కాదు. చిన్నచిన్న పదాల వరకు ఓకే గానీ.. కాస్తా పెద్దవి ఇస్తే మాత్రం దాని భావం రావడం అటుంచితే.. అసలు అర్ధం పోయి.. భయంకరమైన అర్ధాలు వస్తుంటాయి. కొన్ని సార్లయితే పదాలకు అర్ధాలు తెలియక.. దొరికిన పదాలను ఆధారం చేసుకుని తప్పుడు అర్ధాల్ని కూడా గూగుల్ ట్రాన్స్‌లేట్ ప్రదర్శిస్తుంది.
లేటెస్ట్‌గా అది చేసిన భాషా బీభత్సానికి ఇదే తాజా ఉదాహరణ.. మీరు మొబైల్‌లో గానీ యాప్‌లో గానీ..డెస్క్‌టాప్‌లో గానీ గూగుల్ ట్రాన్స్‌లేట్‌లోకి వెళ్లి.. తెలుగు నుంచి ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ సెట్టింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత ‘వినాయకచవితి సందర్భంగా’ అని తెలుగులో ఇవ్వండి, అది ఇంగ్లిష్‌లోకి ఎలా అనువాదమవుతోందో తెలుసా? On the occasion of Vinayaka’s death అని ట్రాన్స్‌లేట్ అవుతోంది. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకునే ‘వినాయక చవితి’ని.. ఇలా చూపించడంలో ఎవరిది తప్పు. బహుశా సమస్య ఎక్కడుందంటే. గూగుల్ ట్రాన్స్‌లేటింగ్ ఇంజిన్.. .వినాయక’చవితి’లో ‘చవి’ అనే రెండక్షరాలను ఒక పదంగా గుర్తించి- దాన్ని ‘చావు’ అనే పదానికి దగ్గరగా ఊహించి – ఇలా పిచ్చిపిచ్చిగా అనువదించి ఉండవచ్చు. అయితే ఇలాంటి వాటిని వెంటనే గుర్తించి మార్చుకోవాల్సిన అవసరముంది. గూగుల్‌కు సహకరించి.. ప్రత్యామ్నాయ అనువాదాల్ని తెలియజేసే సదుపాయాన్ని కల్పించాలి. అలా చేస్తే మనం భాషాభివృద్ధికి చేయూతను అందించే వాళ్లమవుతాం.
చిన్న తప్పుకి ఇంత రాద్ధాంతం చేస్తున్నాడేంటి అనుకుంటున్నారా.. గూగుల్ ట్రాన్స్‌లేట్‌ను కించపరచడం మా ఉద్దేశం కాదు. ఎంతోమందికి భాషలను తర్జుమారు చేయడంలో ఈ టూల్ చాలా ఉపయోగపడుతోంది. ఇదో గొప్ప టూల్.. అలాంటి ఈ టూల్‌ను మరింతగా డెవలప్ చేస్తే.. చాలామందికి సహాయపడుతుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.