*అను‘బంధానికి’ ఆర్టీసీ*
*పార్సిల్ సేవల ద్వారా రాఖీల చేరవేత* హైదరాబాద్: అన్నా,చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా భావించే వేడుకే రాఖీ. పౌర్ణమి. ఎంత దూరాన ఉన్నా ఈ పండుగ నాడు అన్నదమ్ములకు రాఖీలు కట్టడానికి అక్కా చెల్లెళ్లు వెళ్తుంటారు. ఈ ఏడాది కరోనా ఎవరూ, ఎక్కడికీ కదల్లేని పరిస్థితి కల్పించింది. వారి అనుబంధానికి అడ్డుగోడగా నిలిచింది. ఈ తరుణంలో ఆ లోటు తీర్చేందుకు టీఎస్ఆర్టీసీ ముందుకొచ్చింది. పార్సిల్, కార్గో సేవల ద్వారా రాఖీని కోరిన చోటుకు చేరవేసేందుకు సిద్ధమైంది. 8330933532 నంబరుకు ఫోన్ చేసి పార్సిల్‌ను ఎక్కడికి, ఎలా అందజేయాలనే సమాచారం పొందవచ్చని సీనియర్ కస్టమర్స్ రిలేషన్స్ మేనేజర్ సరిరామ్ సోమవారం వెల్లడించారు. దగ్గర్లోని ఆర్టీసీ బస్ డిపోలో కవర్ అందజేసినా, సదరు చిరునామాకు చేరుస్తామని ఆయన వెల్లడించారు.