జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు

0
jagan

ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. మరో కీలక నిర్ణయం. ఇకపై ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూలు రద్దు. ఇకపై రాత పరీక్షలో మెరిట్ ద్వారానే ఉద్యోగాల భర్తీ.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్..ఉద్యోగాల భర్తీలో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దుచేయాలని నిర్ణయించారు. 2020 జనవరి నుంచి భర్తీ చేసే ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉండవు. ఉద్యోగాల భర్తీలో కేవలం రాత పరీక్షలలో మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

అంతేకాదు రాబోయే రోజుల్లో ఏపీపీఎస్సీఉద్యోగాలను అంత్యంత పారదర్శక విధానం ద్వారా భర్తీ చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రతి జనవరిలో ఉద్యోగాల భర్తీపై క్యాలెండర్‌ సిద్ధం చేయాలని.. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలన్నారు.

ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారి తీస్తుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదని.. అత్యవసర సర్వీసులు అందిస్తున్న విభాగాల్లో పోస్టుల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు జగన్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జనవరిలో కొత్త నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల్ని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు.

Aslo Read :

కేసీఆర్‌ను మళ్లీ ఇరుకునపెట్టిన జగన్? భిన్న పంథాలో ఇద్దరు సీఎంలు..!

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారానికి 13వ రోజుకు చేరింది. తమ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మికులు తెగేసి చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని.. చర్చలు జరిపేది లేదని మరో వైపు కేసీఆర్ తన వైఖరిని కుండబద్ధలు కొట్టారు. ఆర్టీసీ మనుగడ సాగించాలంటే.. పోటీతత్వం ఉండాలని కేసీఆర్ చెబుతున్నారు. అందుకే 50 శాతం ఆర్టీసీ బస్సులు 30 శాతం అద్దె బస్సులు.. 20 శాతం బస్సులు ప్రయివేట్ వ్యక్తులు నడిపేలా ఉండాలని సీఎం తెలిపారు.

ఓవైపు సమ్మె కొనసాగుతుండగానే.. తను తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. 1035 బస్సులను అద్దెకు తీసుకోవడం కోసం టెండర్లు ఆహ్వానిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1035 అద్దె బస్సుల్లో 764 బస్సులు హైదరాబాద్ నగర పరిధిలో తిరగనున్నాయి. అక్టోబర్ 21 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ బస్సులు ఆర్టీసీలో చేరితే.. సంస్థలో అద్దె వాహనాల సంఖ్య 3000కు చేరుతుంది.ఈ విధానంలో డ్రైవర్, ఇంధన వ్యయాలను బస్సు ఆపరేటర్ భరించాల్సి వస్తుంది. బస్సు తిరిగిన దూరాన్ని బట్టి ఆర్టీసీ అతడికి డబ్బు చెల్లిస్తుంది. హైదరాబాద్‌లో కిలోమీటర్‌కు రూ.9.6 చెల్లిస్తే.. గ్రామాలు, మిగతా పట్టణాల్లో కిలోమీటర్‌కు రూ.6 చొప్పున చెల్లిస్తారు. ఈ విధానం ద్వారా ఆర్టీసీకి కిలోమీటర్‌కు దాదాపు రూ.8 వరకు ఆదా అవుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. సిటీలో పని చేసే డ్రైవర్లకు హెచ్ఆర్ఏ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అద్దె బస్సుల వల్ల ఆ భారం కూడా తప్పుతుందని వారు తెలిపారు.నిర్వహణ భారం తగ్గించుకోవడం కోసం, సంస్థను లాభాల బాట పట్టించడం కోసం కేసీఆర్ సర్కారు అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానిస్తుండగా.. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఇందుకు పూర్తివిరుద్ధమైన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో పాతబడిన ఆర్టీసీ బస్సుల స్థానంలో వెయ్యి కోట్ల రూపాయలతో 3677 బస్సులు కొనుగోలు చేయడానికి జగన్ ఓకే చెప్పారు. ఈ నిధులను ఆర్టీసీ రుణం రూపేణా సమీకరించనుంది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఇప్పటికే జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Leave a Reply