Teluguwonders:
బిగ్ బాస్ సీజన్ 3 తెలుగు నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా షో మొదలైంది మొన్నీమధ్యనే అనిపిస్తున్నా బిగ్ బాస్ ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఆరు వారాల్లో ఐదుగురు ఇంటి సభ్యులు హౌజ్ నుండి బయటకు వచ్చారు. మొత్తం 16 మంది ఇంటి సభ్యులలో ఇప్పుడు కేవలం 11 మంది మాత్రమే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నారు.
ఇక ప్రతివారం లానే సోమవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ నామినేషన్స్ జరిగాయి. ఈసారి కపుల్స్ గా ఉంచి మిగతా ఇంటి సభ్యులు ఒకరిని నామినేట్ చేసి ఒకరిని సేఫ్ చేసేలా టాస్క్ ఇచ్చాడు. బిగ్ బాస్ ఆరవ వారం హిమజ, మహేష్, పునర్నవి, రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేష్ లు నామినేషన్ లో ఉన్నారు.
ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 3లో ఒక్కసారి కూడా నామినేషన్స్ లో లేని ఒకే ఒక్కడు ఆలి రెజా. మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉన్న ఆలి రెజా 3వ వారం నుండి తన ఆట మొదలుపెట్టాడు. హౌజ్ కెప్టెన్ గా మారడమే కాకుండా హౌజ్ లో అందరితో కలివిడిగా ఉంటున్నాడు. హౌజ్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన ఆలి రెజా ఇప్పటివరకు ఆరు వారాల్లో ఒకసారి కూడా నామినేట్ కాలేదు.
100 రోజుల బిగ్ బాస్ జర్నీలో ఇప్పటికే 40 రోజులు గడిచాయి సో మిగతా 60 రోజుల్లో కూడా ఆలి రెజా ఇలానే స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం టైటిల్ విన్నర్ అతనే అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొదట్లో బాబా భాస్కర్ కూడా టైటిల్ విన్నర్ గా అనిపించినా ఆయన అతి మంచితనమే కొంపముంచుతుంది. మరి బిగ్ బాస్ సీజన్ 3 ఆలి రెజాకు గట్టి పోటీ ఎవరు ఇస్తారో చూడాలి.