ఎప్పుడూ తమ తమ సినిమాలని, షూటింగ్స్ అని బిజీ గా ఉండే మన స్టార్ హీరోలు, విరామ సమయంలో తమ కుటుంబాలతో సరదాగా గడుపుతారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇప్పుడు అదే పని లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘’ RRR చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే .ఆ షూటింగ్ లో.. ఎన్టీఆర్ చేతికి గాయమవ్వడం,తన జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మే5 కూడా అవ్వడం తోషూటింగ్ కి కొంత విరామం ఇచ్చారుJr ఎన్టీఆర్.
మే 5🔅ఎన్టీఆర్ పెళ్లిరోజు*
అవును. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు. నేడు పెళ్లిరోజు సందర్భంగా భార్య ప్రణతితో దిగిన లేటెస్ట్ ఫొటోను ఎన్టీఆర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘ఎనిమిదేళ్లు!! ఇలాంటివి ఎన్నో రావాలని ఎదురుచూస్తున్నా’ అని లవ్లీ క్యాప్షన్ కూడా పెట్టారు. ఎన్టీఆర్ ఈ పోస్ట్ పెట్టగానే అభిమానులు శుభాకాంక్షలు తెలపడం మొదలుపెట్టారు. . ఈ ఫొటోలో ఎన్టీఆర్ చేతికి కట్టుంది. ఎన్టీఆర్ చేతి మణికట్టుకు గాయమైనట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ ఫొటోలో ఆ విషయం స్పష్టమవుతోంది.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం 2011లో జరిగింది. 2014లో ఈ దంపతులకు తొలి సంతానం కలిగింది. కొడుకు అభయ్ రామ్ పుట్టాడు. కిందటేడాది జూన్‌లో రెండో సంతానంగా మళ్లీ కుమారుడే జన్మించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ తన కుటుంబానికి సంబంధించిన విషయాలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెద్దగా షేర్ చేసుకోరు. ఇలాంటి సంతోష సందర్భాల్లోనే ఫొటోలు పెడుతూ ఉంటారు. తన సంతోషాన్ని అభిమానులతో..పంచుకుంటూ ఉంటారు.