ఆర్.ఆర్.ఆర్. కి టైటిల్ ఇదే..నా..!

Spread the love

RRR:రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న  మూవీ కి మంచి పవర్ ఫుల్ టైటిల్ ని వెతికే పని లో మంచి బిజీ గా ఉన్నారు టీం..దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను  అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి.  మొదట్లోనే  ఈ సినిమాకు RRR అని వర్కింగ్ టైటిల్ పెట్టారు వారి ముగ్గురి పేర్లు కలిసి వచ్చేటట్టు. మొన్న RRRకి suit అయ్యే మంచి పేరును సూచించాలని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దానికి అభిమానులను నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దానికి చిత్ర బృందం ఇంకొన్ని మంచి పేర్లు సూచించాలని కోరింది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన పేర్లతో ఒక పోస్టర్‌ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

🔅ఈ పోస్టర్‌కు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న కొన్ని పేర్లు : ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే టైటిల్‌తో పాటు ‘రామ రావణ రాజ్యం’, ‘రంగస్థలంలో రణ రంగం’, ‘రవి చూడని రామరావణ రణ రంగం’, ‘రివల్యూషన్ ఆఫ్ రామరాజు’,‘రైజ్ రోర్ రివోల్ట్’, ‘రాజసం రాక్షసం రావణం’,‘రమ్ రుథిరమ్’,‘రామ రాజ్య రక్షక’, రం రం రుథిరం’,‘రౌద్ర రణ రంగం’   ఇలా ఇంకా చాలా పేర్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ  సినిమాకు అన్ని భాషల్లో కలిపి కామన్‌గా ‘ఆర్ ఆర్ ఆర్’ అనే టైటిల్ ఉంటుంది. ఆయా భాషల్లో క్యాప్షన్ కింద ఒక్కో పేరు ప్రకటిస్తారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రాజమౌళి ప్రేక్షకులు సూచించిన పేర్లే పెడతాడా లేకపోతే ఆల్రెడీ ఒక పేరు అనుకోని మీడియాలో సినిమాకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నాడా అనేది చాలా మంది నెటిజన్స్ ప్రశ్నించకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో మెజారిటీ పీఫుల్స్ కి నచ్చిన టైటిల్ అయితే “రఘుపతి రాఘవ రాజా రాం”..ఫైనల్ గా ఇదే ఫిక్స్ అవుతుందని టాక్..చూద్దాం..ఆ టైటిల్ ఏంటో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *