విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

0
jagan
సాగరతీరంలో ‘విశాఖ ఉత్సవ్’ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకట్టుకొంది. మ్యూజికల్ ఫౌంటైన్ అబ్బురపరిచింది. ఉత్సవ్ కార్యక్రమం ముగిశాక సీఎం జగన్ విజయవాడ వెళ్లారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ హాజరవుతారు.
గ్రాండ్ వెల్ కం.. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక వద్దకు 24 కిలోమీటర్ల మేర భారీ మానవహారం నిర్మించి వెల్ కం చెప్పారు. కైలసగిరి, సెంట్రల్ పర్క్ వద్ద అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. రూ.1285.32 కోట్లు పనులకు శంకుస్థాపన చేశారు.

షార్ట్ ఫిల్మ్.. విశాఖ ఉత్సవ్‌లో సీఎం జగన్ అజెండాను షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరించారు. విశాఖపట్టణం ప్రత్యేకతను తెలిపేలా లఘుచిత్రం ఉంది. ఇక్కడున్న ప్రతిష్టాత్మక సంస్థలు, ప్రత్యేకతలు తెలిసేలా ప్రదర్శనలు ఉన్నాయి. స్టీల్ సిటీపై జగన్‌కు ప్రత్యేక అభిమానం అని స్లైడ్ షో కూడా ఏర్పాటు చేశారు.

నేనున్నాను.. విశాఖ అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నానని జగన్ తెలిపేలా షార్ట్ ఫిల్మ్ ఉంది. ఆంధ్రుల కీర్తి బావుటాలా విశాఖపట్టణం రెపరెపలాడుతోందని ప్రత్యేక ప్రదర్శించారు. లఘుచిత్రాని సీఎం జగన్, నేతలు, అధికారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. విశాఖ ఉత్సవ్‌కు భారీ సంఖ్యలో జనాలు వచ్చారు.

Leave a Reply