తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. 👉కొన్ని చోట్ల బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టాయి. 👉మరికొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు లెటర్లు దర్శనమిచ్చాయి. నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ డిమాండ్లను లేఖ రూపంలో రాసి బాక్సుల్లో వేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. వాటిలో వెరైటీ డిమాండ్లు ఉన్నాయి. సార్ కేసీఆర్ గారు..మా ప్రాంతంలో కింగ్ ఫిషర బీర్లు దొరకడం లేదని ఓ యువకుడు లేఖ రాశాడు. ఆ బీర్ల కోసం తమ జగిత్యాల జిల్లాను కరీంనగర్‌లో విలీనం చేయాలని కోరాడు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
🔴మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్‌లో:
జగిత్యాల జిల్లా రాయికల్ మండపలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్‌లో మరో లెటర్ బయపడింది. తమ ఊరిలో రోడ్లు గంతులతో నిండిపోయాయని.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్పందించి కొత్త రోడ్లు వేయాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
🔴గర్రెపల్లి గ్రామంలో బ్యాలెట్ బాక్స్‌లో :
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో బ్యాలెట్ బాక్స్‌లోనూ ఓ లేఖ బయటపడింది. తమ గర్రెపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని అందులో గుర్తు తెలియని వ్యక్తి విజ్ఞప్తి చేశారు.