ఆరోగ్యాన్ని అందించడంలో కూరగాయల్నీ, పండ్లనీ మించినవి ఉండవు.
“అలాంటి వాటితో చేసిన కొన్ని జ్యూసులు … తాగితే అంతకు మించిన ఆరోగ్యం ఉండదు”
బీట్రూట్ జ్యూస్ :. తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బీట్ రూట్ జ్యూస్ తాగడం అలవాటు చేసుకోవాలి.రెండు మూడు రోజులకోసారి గ్లాసుడు బీట్ రూట్
జ్యూస్ తాగితే చాలు .కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడొచ్చు. దీనిని తాగడం వల్ల శరీరానికి కావాల్సిన చక్కెర సమపాళ్లల్లో ఆంది,నీరసం దరిచేరదు. దీన్నుంచి విటమిన్ బి, సి పుష్కలంగా అందుతాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
🔅కాకర జ్యూస్: దీని పేరు చెబితే చేదు ఆని దూరం జరిగే వాళ్లే ఎక్కువ. కానీ చేసే
మేలు చాలా ఎక్కువ. ఇందులో షుగర్ ఉండదు కనుక మధుమేహులకూ ఇది
చాలా మంచిది. జీర్ణశయాన్ని శుద్ధి చేస్తుంది.
🍉పుచ్చకాయ జ్యూస్: రోజులో మనిషికి కావల్సిన ఖనిజాలూ, ఇతర పోషకాలూ, ఉప్పూ.. ఒక గ్లాసుడు పుచ్చకాయ రసం తాగితే చాలు అందుతాయి. డీ హైడ్రేషన్ సమస్య దరిచేర కండా కాపాడుతుంది. ఆది శరీరంలో ఉన్నవ్యర్థ పదార్ధ్యాలనూ బయటికి పంపిస్తుంది.దీనిని ఎంత తాగినా కొంచెం కూడా బరువు పెరగరు.చాలా చల్లదనం కూడా.
🥕క్యారెట్ జ్యూస్: రోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగితే చాలు… చర్మం మిలమిల మెరిసిపోతుంది. విటమిన్ *A సమృద్ధిగా ఉండే కూరగాయ ఇది. ప్రత్యేకించి చర్మ సమస్యలూ, కళ్ల సమస్యలు ఉన్న వాళ్లు క్యారెట్ జ్యూస్ తాగితే ఉపశమనం కలుగుతుంది. So ఫ్రెండ్స్ సమ్మర్ లో..ఈ juices చల్లగా తాగేయ్యండి.. ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.