రైతన్నలకు శుభవార్త.. మీకోసం ఈ ట్రాక్టర్

Good news for the farmers .. This tractor is for you
Spread the love

Teluguwonders:

పెట్రోల్‌తో నడిచే వాహనాలకు కాలం చెల్లనుంది. మార్కెట్లో ఇప్పుడన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేస్తున్నాయి. దీంతో సౌండ్ పొల్యూషన్ వుండదు. ఎయిర్ పొల్యూషన్ అసలే ఉండదు. పర్యావరణానికి హాని జరగకుండా ఉండే ఈ-వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నాయి సంస్థలు. ఈ క్రమంలోనే వ్యవసాయానికి ముఖ్యమైన ట్రాక్టర్‌ని రూపొందించింది అస్సోం రాష్ట్రం దుర్గాపూర్‌లోని సీఎస్‌ఐఆర్ సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (CMWRI). బ్యాటరీతో పనిచేసే ఈ ట్రాక్టర్ సామర్థ్యం 10 హెచ్‌పీ ఉంటుంది. దీని ధర లక్ష వరకు వుంటుందని అంటున్నారు. అయితే రైతన్నల కోసం తక్కువ ధరకే వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం పరిశోధనా కేంద్రంలో ట్రయల్ టెస్టింగ్‌ చేస్తున్నామని సీఎస్‌ఐఆర్-సీఎంఈఆర్‌ఐ డైరక్టర్ హరీశ్ హిరానీ తెలిపారు. చిన్న, సన్న కారు రైతులను దృష్టిలో పెట్టుకుని ఈ-ట్రాక్టర్ రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే ఈ-ట్రాక్టర్ బ్యాటరీని ఒకసారి చార్జి చేస్తే గంట సేపు పని చేస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *