🌞సాధారణంగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటితే వడగాలులు వీస్తాయి. ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతలు చూస్తుంటే వడగాలులు విజృంభిస్తున్నట్టు గా అర్థం అవుతుంది.తెలుగు రాష్ట్రాలపై భానుడు కన్నెర్రజేస్తోన్నడు .అవును అందుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలే ఒక నిదర్శనం.ఆంధ్రా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.
🌞అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగటానికి కారణం ఏంటంటే : ఫణి తుఫాను ప్రభావం .ఫణి తుఫాను కోస్తా తీరం గుండా పయనించి ఆ ప్రాంతాల్లోని తేమను ఒడిశా, పశ్చిమ్ బెంగాల్‌వైపు తీసుకుపోవడంతో ఉష్ణోగ్రతలు పెరిగి, తెలుగు రాష్ట్రాలు రెండూ నిప్పుల కొలిమిల్లా మారాయి. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో వడగాల్పులు వీస్తున్నాయి ఏపీ లోఉదయం 8 గంటల నుంచి ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్ల నుంచి రావడానికి జనం భయపడుతున్నారు. .
🌞వాస్తవానికి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా ఉష్ణోగ్రతలు ఒకేలా నమోదవుతున్నాయి. ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన వేడి సాయంత్రమైనా తగ్గుముఖం పట్టడం లేదు.
👉ఆంధ్రా లో పరిస్థితి: ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో ఆదివారం సాధారణకంటే మూడు నుంచి ఐదు డిగ్రీ అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం తో ప్రజలు చాలా ఇబ్బందిపడ్డారు.
👉తెలంగాణలోనూ భానుడి ప్రకోపం కొనసాగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదివారం పలుచోట్ల నమోదయ్యాయి. కొన్ని చోట్ల 46 డిగ్రీలను దాటిపోయాయి.
అత్యధిక ఉష్ణోగ్రత🌞: ఖమ్మం జిల్లా బాణాపురంలో -46.3 డిగ్రీలు, ముదిగొండ, పెనుబల్లిలో 46.2 డిగ్రీలు, గుబ్బగూడెం, వైరా, పల్లెగూడెంలో 46.1 డిగ్రీలు, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
🌞భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 45.9, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉర్లుగొండులో 45.8, హైదరాబాద్‌లో 41.5 డిగ్రీలుంది. ఖమ్మంలో గత పదేళ్ల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది.ఇక్కడ 2016 ఏప్రిల్ 24న 45 డిగ్రీలు నమోదుకాగా, ఆదివారం దానికన్నా ఒక డిగ్రీ పెరిగింది. సాధారణంగా
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆ స్థాయి ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. పోలవరంలో రెండు రోజులుగా 45.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది.
👉ఉపరితల ద్రోణి ప్రభావం : ఛత్తీస్‌గఢ్ ఈశాన్య ప్రాంతం నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడుల మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకు 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉందని, రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం పది గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ రెండు రోజులు జాగ్రత్త 🌞 : మరోవైపు సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ రెండు రోజులూ 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతల్లో అసాధారణ మార్పులు ఉంటాయని, వడగాలులు తీవ్రం అవుతాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందినట్టు కడప కలెక్టర్ సి.హరికిరణ్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండలో బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మే 10 వరకు ఎండల తీవ్రత ఇలానే ఉంటుందని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరి.