ఔను కల లు..భవిష్యత్తు ని ముందుగానే చూపిస్తాయి. చరిత్ర ను చూస్తే..
జీసస్ విషయంలో : జీసస్ క్రీస్తు పసిబాలుడుగా ఉన్నప్పుడు జోసెఫ్ కు కలలో ఒక దేవదూత కనిపించి హెరోడ్ రాజు తన దేశంలో చంటిపిల్లలను వధిస్తున్నాడనీ, కాబట్టి జీసస్సుని తీసుకుని ఈజిప్ట్ పొమ్మని ఆదేశించినట్లు ఒకగాధ వుంది. కలలోఆదేశించిన ప్రకారం జోసఫ్ జీసస్ ను తీసుకుని రహస్యంగా ఈజిప్ట్ చేరుకున్నాడు. మరి జోసఫ్ కి ఆ కల రాకపోతే ప్రపంచ చరిత్ర మరొక విధంగా ఉండేదేమో.. 🔅
ముస్లింస్ విషయంలో : బక్రీదు పండుగ జరుపుకోవడానికి మూలకారణం అబ్రహంకు వచ్చిన స్వప్నమే. భగవంతుడు కలలో కనిపించి సత్కార్యాలు చేయమని ఆదేశిస్తాడని మహమ్మదీయుల భావన.
🔅బుద్దుని విషయంలో : గౌతముడు సాహిక జీవితం గడుపుతున్నప్పుడు ఆయన భార్యకు ఒకనాటి కలలో తన భర్త సన్యాసాశ్రమం తీసుకున్నట్లు, తనను వదిలి వెళ్ళిపోయినట్లు కల వచ్చింది.ఆ విషయాన్ని తన భర్తతో ప్రస్తావించినప్పుడు “దానికంత భయపడవలసింది లేదు, ఆది కంగారు పడవలసిన విషయం కాదు” అన్నారట గౌతముడు. తరువాత ఆయన
బుధుడుగా మారటం, తన సిద్ధాంతాలను ప్రపంచ వ్యాప్తం చేయటం అందరికీ తెలిసిందే.
ఇతర మతాలన్నిటికన్నా బౌద్ధమతంలో కలలకు విశేష ప్రాముఖ్యం ఇచ్చేవారని జాతక
కథలు సూచిస్తున్నాయి. వీటి ఆధారం గా చూస్తే కలలు భవిష్యత్తుని చూపిస్తాయని రుజువు అవుతుంది.