రాహుల్ గాంధీ ఎవరు అంటే రాజీవ్ గాంధీ,సోనియా ల కుమారుడు, ఇందిరా గాంధీ మనవడు,చాచా నెహ్రు గారి ముని మనవడు. ఆయన గురించి చెప్పాలంటే కొలమానాలు ఇవే. రాహుల్ గాంధీని తనకంటూ ఒక ప్రత్యేకత లేనివాడిగా చెప్పుకుంటారు చాలా మంది . కాంగ్రెస్ లో ఎంత రాజకీయ నేతగా ఉన్నా కానీ అది తప్ప ఆయనలోని మరో కోణం ఎవరికీ తెలియదు. కానీ మొన్న జరిగిన ఒక సంఘటన తో తన లోని మరో కోణాన్ని బయట పెట్టాడు రాహుల్ . రాహుల్ మెకానిక్ గా అవతారమెత్తారు. ..హెలికాప్టర్‌ను రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. చాపర్ కిందకు చేరి నేలపై పడుకొని మరమ్మతు చేశారు రాహుల్. అలాగని ఆయన హెలికాప్టర్‌ను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసే నిపుణుడని అనుకోవద్దు. ఏదో చిన్న సమస్య వస్తే తాతూ ఓ చెయ్యి వేసి దాన్ని సరిచేశారు.
👉విషయం లోకి వెళ్తే ; హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో శుక్రవారం రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి వెళ్లాల్సిన తరుణంలో.. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు సాంకేతిక సమస్య వచ్చింది. దాంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది, హెలికాప్టర్ సిబ్బంది దాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. రాహుల్ గాంధీ సైతం ఓ చెయ్యివేసి వారికి సహకరించారు. నేలపై పడుకొని హెలికాప్టర్ డోర్స్ స్క్రూలు బిగించారు. ఇలా అందరం కలిసికట్టుగా పనిచేసి మరమ్మతు చేశామని.. ప్రమాదమేమీ లేదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టగ్రామ్‌లో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఇప్పుడా ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు ఆయనపై ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇందుకే పనికి వస్తాడంటూ సెటైర్లు వేస్తున్నారు.