ఎప్పుడో కనుమరుగయిపోయిన జీవులు,వస్తువులు మళ్ళీ కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశోధకులకయితే ఇలాంటి విషయాలు పండుగే. 👉విషయం లోకి వెళ్తే 𒐚చాలా కాలం తర్వాత ఒక ప్రాణి మళ్ళీ కనపడింది .అది కూడా వందేళ్లు కాదు.. వెయ్యి ఏళ్లు కాదు. లక్షన్నరేళ్లు. ఊహకు అందనంత కాలం. అప్పట్లో ఈ భూమి మీద ఎగిరిన పక్షి.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మనిషి కంట్లో పడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతరించిపోయిందనుకున్న సదరు పక్షి ఇప్పుడెలా మళ్లీ వచ్చిందన్నది ఒక ప్రశ్న అయితే.. పుస్తకాల్లో మాత్రమే పరిమితమైన పక్షి.. కంటి ముందు కనిపించటం ఇప్పుడు పరిశోధకుల మెదడుకు కొత్త మేతగా మారింది.
👉ఇంతకీ ఆ పక్షి పేరేంటి? అదెక్కడ ఉంది? దాన్నెలా కనిపెట్టారన్న సంగతుల్ని చూస్తే..
🔅మడగాస్కర్ ఐలాండ్ సముద్రంలో మునిగిపోయిన నాటి నుంచి కనిపించకుండా పోయిన ఒక పక్షి “రెయిల్”. గొంతుపై తెలుపు రంగు ఉండే ఈ అరుదైన పక్షి.. లక్షన్నరేళ్ల తర్వాత మళ్లీ కనిపించింది. దీనికి సంబంధించిన శిలాజాలు కూడా లభించాయి. హటాత్తుగా హిందూ మహాసముద్రంలోని అల్డాబ్రా దీవుల్లో మళ్లీ కంటపడిన ఈ పక్షిని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.యూకేలోని వర్సిటీ ఆఫ్ పోర్డ్స్ మౌత్.. లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందినవిగా గుర్తించారు. ఇటిరేటీవ్ ఎవల్యూషన్ పద్దతిలో అంతరించిపోయిన పక్షులు కొన్ని తిరిగి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరించిపోయిన పక్షులు ఇలా రావటం చాలా అరుదైన ప్రక్రియగా చెబుతున్నారు. దురదృష్టకరమైన విషయం ఏమంటే.. లక్షన్నరేళ్ల తర్వాత మళ్లీ కనిపించిన రెయిల్.. ఇప్పుడు ఎగరలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఏమైనా.. లక్షన్నరేళ్ల క్రితం నాటి పక్షులు ఇప్పుడు తిరిగి రావటం ఆసక్తికర పరిణామంగా చెప్పక తప్పదు. దీంతో ఇలాంటి అరుదైన ప్రాణుల కోసం పరిశోధకుల అన్వేషణ మరింత పెరిగింది.