Teluguwonders:
బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడిప్పుడే ఆసక్తిగా మారుతుంది. ఇప్పటికే ఈ సీజన్ ఐదు వారాలని పూర్తీ చేసుకొని , ఆరోవారంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే హౌస్ లో నుండి కొంచెం వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసారు. దీనితో ప్రస్తుతం హౌస్లో ఉన్న ప్రతిఒక్కరు మిగిలిన అందరికి గట్టి పోటీనిచ్చేలా ఉండటం తో బిగ్ బాస్ మరింత ఆసక్తిగా మారబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
ఇకపోతే ఈ ఆరోవారం నామినేషన్స్ కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. మహేష్ , రాహుల్ , పునర్నవి , వరుణ్ , హిమజ , రవి లు ఈ వారం ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. ప్రస్తుతం నామినేట్ అయిన వారందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో వీరిలో హౌస్ నుండి బయటకి వెళ్లిపోయేదెవరో చూడాలి.
మొత్తంగా ఈ వారం నుండి బిగ్ బాస్ హౌస్లో టఫ్ కాంపిటేషన్ ఉండబోతుంది అని అర్థమౌతుంది. ఇక తాజాగా వచ్చిన ప్రోమోని ఒకసారి చూస్తే ….. బిగ్ బాస్ హౌస్లో అసలైన రచ్చ మొదలైనట్టు చాల స్పష్టంగా అర్థమౌతుంది. గత రెండు సీజన్లకి భిన్నంగా ఈ సారి హౌస్లోకి ఒక జంటని పంపించారు. ఇలాగే గతంలో కొన్ని బిగ్ బాస్ సీజన్స్ లో జంటలుగా లోపలి వెళ్ళినవారు విడిపోయి బయటకి వచ్చారు. అలాగే ఒంటిరిగా లోపలి వెళ్లిన వారు జంటగా బయటకి వచ్చారు. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ , వితిక జంటగానే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
మొదట్లో కొన్ని రోజులు ఎంతో అన్యోన్యంగా ఉన్నపటికీ కూడా ఈ మద్యే వీరిద్దరి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా వచ్చిన ప్రోమోలో వరుణ్ అండ్ వితిక ఒక రేంజ్ లో గొడవపడుతున్నట్టు అర్థమౌతుంది. హౌస్ మేట్స్ ఎంతగా ఆపాలని ట్రై చేసినప్పటికీ వినిపించుకోవడం లేదు. అలాగే వితిక కూడా కొంచెం ఓవర్ గానే రియాక్ట్ అవుతుంది అన్న విషయం తెలిసిందే. అసలు నువ్వు ఎందుకు ఆలా బిహేవ్ చేస్తున్నావ్ ..చాల రూడ్ గా బిహేవ్ చేస్తున్నావ్ అంటూ వరుణ్ వితిక పై మండిపడుతున్నాడు. దీనితో వితిక నా దగరికి రావద్దు అని చెప్తుంది ..ని దగ్గరికి రావద్దు అంటే ..అలాంటప్పుడు ఇంట్లో ఉండద్దు అంటూ వరుణ్ చాల సీరియస్ గా మాట్లాడుతున్నాడు..హౌస్లో జరిగేదేదైనా కూడా నువ్వు స్ఫోటివ్ గా తీసుకో అంటూ తన భార్య కి చురకలు అంటిస్తున్నాడు.
ఇక బయటకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉండగా వితిక మాట్లాడుతూ ..ఏంటి ఇప్పుడు అంటే వరుణ్ చాల కోపం ఒకట్టిచ్చాడు..దీనితో వితిక కళ్ళలో గంగ పొంగుకొచ్చింది. వితిక వెళ్లి స్విమింగ్ ఫుల్ వద్ద కూర్చొని ఏడుస్తుంటే ..వరుణ్ బెడ్ రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నాడు.. హౌస్ మేట్స్ అందరూ కలిసి వారిని ఓదార్చుతున్నట్టు ప్రోమో చూస్తుంటే అర్థమౌతుంది. మొత్తంగా బిగ్ బాస్ హౌస్ ఈ జంట మధ్య పెద్ద చిచ్చు పెట్టినట్టు కనిపిస్తుంది.