స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ

Spread the love

*స్కూల్ పిల్లలకు లక్ష రూపాయల పోటీ…* హైదరాబాద్ : ప్రేవేటు, గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పిల్లలకు లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే పోటీని సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ప్రకటించింది. నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపించే ఇన్నోవేటివ్ ఐడియా మీ దగ్గరుంటే చాలు.. వెంటనే ఈ పోటీలో పాల్గొనండి. పిల్లల్లో ఉన్న కొత్త ఆలోచనలు, కొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చేందుకు ఈ పోటీని నిర్వహిస్తోంది. పన్నెండవ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరూ పోటీలో పాల్గొనవచ్చు. పద్ధెనిమిదేళ్లలోపు వయస్సుండాలి. *బహుమతుల వివరాలిలా ఉన్నాయి.* *ఫస్ట్ ప్రైజ్…* రూ. లక్ష, *సెకండ్ ప్రైజ్(ఇద్దరికి)…* రూ. 50 వేలు, *థర్డ్ ప్రైజ్(ముగ్గురికి)…* రూ. 30 వేలు, *ఫోర్త్ ప్రైజ్(నలుగురికి)* రూ.20 వేలు, *ఫిఫ్త్ ప్రైజ్(ఐదుగురికి)* రూ. 10 వేలు. *పూర్తి వివరాలకు…* ciasc.ipu@niscair.res.in కు మెయిల్ చేయవచ్చు లేదా www.csir.res.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఇన్నోవేటివ్ ఐడియా లేదా క్రియేటివ్ డిజైన్ లేదా సొల్యూషన్… ఏదైనా ఇంగ్లిష్ లేదా హిందీలో 5,000 పదాలకు మించకుండా రాయాలి. మీ స్కూల్ ప్రిన్సిపల్ ధ్రువీకరణతో పంపించాలి. *దరఖాస్తులకు చివరి తేదీ* : జూన్ 30 . *ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లో పంపించవచ్చు.* *బెస్ట్ 15 ఎంట్రీలకు క్యాష్ ప్రైజ్‌తో పాటు సర్టిఫికెట్ అందించనున్నారు.*


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading