మరొక్కసారి చూడండి : ఈ ఫోటో లో కొండల్లో తిరిగే దెయ్యాలు(మంచు చిరుతలు) మీకు కనపడుతున్నాయా..

Spread the love

మీరు మహా అయితే చిరుత ని చూసుంటారు.. అది కూడా మాక్సిమం జూ లోనో,సర్కస్ లోనో చూసుంటారు. కానీ మంచు కొండల్లో ఉండే ఈ మంచు చిరుత ను మాత్రం మీరు ఎప్పుడూ చూసి ఉండరు .

👉మంచుచిరుతలు : అవి ఎక్కువగా మంచు కురిసే చోట, కొండలు, గుట్టల్లో ఉంటాయి. మంచు చిరుతలనే కొండల్లో ఉండే దెయ్యాలు అని పిలుస్తారు. ఇవి కొండ ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తుంటాయి. సముద్ర మట్టానికి 9800 ఫీట్ల నుంచి 17 వేల ఫీట్ల ఎత్తులో అవి నివసిస్తాయి.

👉వీటి ప్రత్యేకత : కొండలు గుట్టల రంగును పోలి ఉండే ఈ చిరుతను పక్కన ఉన్నా గుర్తు పట్టడం కష్టం. ఒక ఫోటోగ్రాఫర్ ఈ మంచు చిరుతను ఫోటో తీయడం తో అది
వార్తల్లోకెక్కింది .

👉విషయం లోకి వెళ్తే : హిమాచల్ ప్రదేశ్‌లోని కిబ్బెర్ అనే గ్రామానికి వెళ్లిన సౌరభ్ దేశాయ్ అనే ఓ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్.. ఆ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో మంచు చిరుతను చూశాడట. 👉 చూడగానే ఆశ్చర్యపడి ఆ చిరుతను తన కెమెరాతో క్లిక్‌మనిపించాడు. పెద్ద కొండ మధ్యలో ఉన్న చిరుతను ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు.

👍♦ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు పులి : మంచు పులి ఫోటో సోషల్ మీడియాలో వైరల్అవుతుంది. వైరల్ అవడమే కాదు.. 👉👉కానీ ఆ ఫోటోలో ఎవరికీ పులి కనపడట్లేదు : విచిత్రమేమిటంటే ఆ పులి కొండలు గుట్టల రంగును పోలి ఉండటం తో ఫోటోలో అసలు మంచు చిరుత కనపడట్లేదు.ఎక్కడుందా అని నెటిజన్లు తెగ ప్రయత్నించారు. చాలామందికి చిరుతను కనుక్కోవడం సాధ్యం కాలేదు.మీరేమయినా కనిపెట్టగలరేమో ట్రై చెయ్యండి.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *