ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసిన పీవీ సింధు..

Sindhu Meets CM Kcr In Pragathi Bhavan
Spread the love

Teluguwonders:

ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ గెలిచిన పీవీ సింధును సీఎం కేసీఆర్ అభినందించారు. గోల్డ్ మెడల్ సాధించిన సింధు దేశానికి గర్వకారణంగా నిలిచిందని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. భవిష్యత్తులో జరిగే టోర్నమెంట్లలో పాల్గొనేందుకు, సిద్ధమయ్యేందుకు కావాల్సిన ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా చేస్తామని హామీ ఇచ్చారు. పివి సింధు, ఆమె తల్లిదండ్రులు, కోచ్ గోపీ చంద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చాముండేశ్వరి నాథ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిశారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీల్లో విజేతలను తయారు చేసేవేదికగా హైదరాబాద్ మారిందన్నారు సీఎం కేసీఆర్.

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో గెలిచిన గోల్డ్‌మెడల్‌ను సీఎం కేసీఆర్‌కు చూపించారు పీవీ సింధు.

రెండు రాకెట్లను సీఎంకు బహుకరించారు. పీవీ సింధుకు పుష్పగుచ్చం ఇచ్చి, షాలువా కప్పి సన్మానించారు సీఎం కేసీఆర్.

పీవీ సింధు దేశ గౌరవాన్ని నిలబెట్టింది. ప్రపంచ చాంపియన్ షిప్ గెలవడం ద్వారా 130 కోట్ల మంది భారతీయుల్లో ఒక్కరుగా నిలిచారు. ఇది మనందరికీ గర్వకారణం. ఇలాంటి ఘనతలు సాధించడం ఆషామాషీ విషయం కాదు. కఠోర సాధన, శ్రమ, శ్రద్ధ అవసరం. ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం కాదు. స్వతహాగా జాతీయ క్రీడాకారులైన రమణ దంపతులు తమ కూతురును గొప్పగా తీర్చిదిద్దారు. గోపీ చంద్ చక్కగా శిక్షణ ఇచ్చారు. సింధు భవిష్యత్తులో ఇంకా అనేక టోర్నమెంట్లలో పాల్గొనాలి. మరిన్ని పతకాలు సాధించాలి. — సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డిజిపి మహేందర్ రెడ్డి, పోలీస్ కమీషనర్లు అంజనీ కుమార్, విసి సజ్జనార్, మహేష్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజి నవీన్ చంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *