కుంభకర్ణుడి చెల్లెలు ఇంకా ఉంది

Spread the love

🔅నిద్రను దూరం చేసుకోవడం వల్ల కలిగే రోగాలు, నష్టాల గురించి చాలామందికి తెలుసు. కానీ నిద్రే రోగంగా మారి పీడిస్తుంటే… నిద్ర వద్దు బాబోయ్ అని ఎంత పట్టుదలగా ఉన్నా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటే… ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రోజుల తరబడి నిద్రలోనే ఉండిపోతే…ఇది నిజంగా ఈ కాలం లో జరుగుతుందా అనుకుంటున్నారా అయితే

🔅 మీ కోసమే ఈ అమ్మాయి కధ

🔅కుంభకర్ణుడి చెల్లెలు:కుంభకర్ణుడి గురించి భారతీయులకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఆరు నెలలపాటు ఏకధాటిగా నిద్రపోయేలా రావణుడి సోదరుడయిన కుంభకర్ణుడికి బ్రహ్మ వరమిస్తాడు. మరి ఏ దేవుడి వరమో, ఎవరు ఇచ్చిన శాపమో కానీ ఓ యువతి కూడా ఈ కుంభకర్ణుడికి పోటీనిస్తోంది. కుంభకర్ణుడిలా ఆరు నెలలు కాదు గానీ ఏకధాటిగా పన్నెండు రోజుల పాటు నిద్రపోతోంది. బ్రిటన్‌కి చెందిన లూసియా బాల్ అనే 22 ఏళ్ల యువతి పడుకుంటే చాలు 8 నుంచి 12 రోజుల పాటు నిద్రపోతోంది. స్లీపింగ్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న ఈ యువతి రోజులో దాదాపు 22 గంటలపైనే నిద్రపోతుంది. మిగిలిన రెండు గంటలు కూడా మగత నిద్రలో ఉంటుందట. ఆ సమయంలో అతి కష్టం మీద ఆమె తల్లిదండ్రులు ఆహారం, నీళ్లు, కాలకృత్యాలు వంటి అవసరాలను తీరుస్తారు. వెన్వెంటనే మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. ఈ నిద్ర రోగం వల్ల అమ్మాయి చదువు కోల్పోతోందనీ, ప్రయాణాలు చేయలేకపోతోందనీ తల్లిదండ్రులు వాపోతున్నారు. క్లీనె-లెవిన్ సిండ్రోమ్ (Kleine-Levin) వల్ల ఈ విధంగా రోజుల తరబడి ఆమె నిద్రపోతోందని వైద్యులు తెలిపారు. దీనికి కచ్చితమైన వైద్యం లేదని డాక్టర్లు కూడా తేల్చేశారు. ఇలాంటి నిద్ర రోగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 మందికి పైగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *